పిచ్చోడిని చేశాడు.. గదిలో బంధించి చిత్రహింసలు.. అమీర్‌ఖాన్‌పై సొంత తమ్ముడి ఆరోపణలు

4 దశాబ్ధాలుగా భారతీయ చిత్ర పరిశ్రమకు ఐకాన్‌గా వెలుగొందుతున్నారు అమీర్‌ఖాన్. నటన కంటే కూడా వ్యక్తిత్వంతో ఆయన కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు. రొమాన్స్, కామెడీ, యాక్షన్, లవ్ ఇలా ఏ జోనర్‌ అయినా అద్భుతంగా ఒదిగిపోగల నటుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అమీర్‌ఖాన్. నటననే కాదు.. తనను తాను మార్చుకోగల సత్తా ఆయన సొంతం. 60 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లను మించి పోటీ పడుతున్నారు అమీర్ ఖాన్. అలాంటి వ్యక్తిపై సొంత తమ్ముడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

అమీర్ ఫ్యామిలీకి ఆఫ్గన్ మూలాలు
అమీర్ పూర్తి పేరు మహ్మద్ అమీర్ హుస్సేన్ ఖాన్ .. 1965 మార్చి 14న జన్మించారు . ఆయన తండ్రి పేరు తాహిర్ హుస్సేన్. నలుగురు తోబుట్టువుల్లో అమీర్ రెండో వారు. అమీర్ ఖాన్ తమ్ముడు ఫైసల్ ఖాన్, సోదరిలు ఫర్హాత్, నిఖాత్ ఖాన్‌. నిజానికి అమీర్ పూర్వీకులు ప్రస్తుత ఆఫ్గనిస్తాన్‌లోని హీరత్‌కు చెందినవారు. అమీర్ ఖాన్ తాతగారు స్కూల్ టీచర్‌గా పనిచేశారు. నాయనమ్మ.. సౌదీ అరేబియాలోని జెద్దాకు చెందినవారు. స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు స్వయానా మేనకోడలు.

Faisal Khan blames his brother Bollywood Super Star Aamir Khan

60 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి రెడీ
అమీర్ ఖాన్ బంధువుల్లో చాలా మంది బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కీలక స్థానాల్లో ఉన్నారు. యాదోంకి బారాత్‌లో బాల నటుడిగా నటించిన అమీర్ ఖాన్ ఆ తర్వాత 1984లో పూర్తి స్థాయి హీరోగా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. నాటి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ ప్లేస్‌కు చేరుకుని బాలీవుడ్ సూపర్‌స్టార్‌గా.. ఖాన్ త్రయంలో ఒకడిగా భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఒకడిగా నిలిచాడు. ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్న అమీర్ ఖాన్.. నిర్మాతగా ఎంతోమంది ప్రతిభావంతులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన కీలకపాత్ర పోషించిన కూలీ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రీనా దత్తా, కిరణ్ రావులను పెళ్లాడిన అమీర్ ఖాన్ 60 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమయ్యారు.

తమ్ముడితో అమీర్‌ఖాన్‌కు విభేదాలు
ఇదిలాఉండగా.. అమీర్ ఖాన్‌పై తమ్ముడు ఫైసల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలి నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్న సంగతి బాలీవుడ్ మొత్తానికి తెలుసు. ఆస్తి విషయంగా ఫైసల్ న్యాయ పోరాటం చేస్తున్నారు. 1988లో ఫైసల్ సినీరంగ ప్రవేశం చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, నటుడిగానూ ఫైసల్ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అమీర్ తనను ఏడాది పాటు గదిలో బంధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు మెంటల్ కండీషన్ బాలేదని, పిచ్చిపట్టిందని నిందలు వేశారని ఫైసల్ తెలిపారు. నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలు చేపట్టకపోవడంతో నాకు పిచ్చి పట్టిందని అనుకున్నారని పేర్కొన్నారు. అమీర్ తనను ఏడాది పాటు గదిలో బంధించాడని, నా ఫోన్ లాక్కుని కమ్యూనికేషన్ కట్ చేశాడని ఫైసల్ తెలిపారు.

నాన్నను కలవనీయలేదు
నా గది బయట బాడీ గార్డ్స్‌ను కాపలా పెట్టి, అవసరమైన మందులు ఇచ్చేవారని.. దీని నుంచి నన్ను కాపాడగలిగింది నా తండ్రి మాత్రమేనని కానీ ఆయనను ఎలా సంప్రదించాలో తెలియలేదని ఫైసల్ ఎమోషనల్ అయ్యారు. అయితే ఏడాది తర్వాత అమీర్ నన్ను మరో ఇంటికి తరలించాడని తెలిపారు. తనకు మానసిక వ్యాధి ఉన్న మాట నిజమేనని.. ఇందుకోసం ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నానని ఫైసల్ ఖాన్ పేర్కొన్నారు. అయినప్పటికీ అమీర్ తనను గదిలో బంధించాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X