పెళ్లి వేడుక: మేనల్లుడితో కలిసి డాన్స్ చేసిన సుష్మితా సేన్!
బాలీవుడ నటి సుష్మితా సేన్ తన కూతురు అలీషా, బాయ్ ఫ్రెండ్ రోహ్మాన్ షావల్‌తో కలిసి ఢిల్లీలో జరిగిన తమ బంధువుల వివాహ వేడుకలో సందడి చేస్తున్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
ఓ వీడియోలో సుష్మితా... పెళ్లికుమారుడైన తన మేనల్లుడు శివ్‌తో కలిసి స్టెప్స్ వేయడం గమనార్హం. బీవీ నెం.1 మూవీలోని చునారి చునారి పాటకు ఇద్దరూ డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
శివ్, రుక్మణ్ వివాహం
సుష్మితా సేన్ మేనల్లుడు శివ్ వివాహం తన ప్రియురాలు రుక్మణ్‌తో జరుగుతోంది. ఢిల్లీలో ఈ వేడుక జరుగుతుండటంతో తన కూతురు, బాయ్ ఫ్రెండుతో కలిసి హాజరైన సుష్మితా సందడి చేశారు.
ఈ పెళ్లి వేడుకలో చాలా ఎంజాయ్ చేశాం
తమ బంధువుల పెళ్లి వేడుకలో చాలా సందడిగా గడపినట్లు వెల్లడించిన సుష్మితా సేన్... అందరూ ఒకే చోట చేరి హ్యాపీగా గడిపిన మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుండి పోతాయని తెలిపారు.

బ్లాక్ సారీలో సుష్మితా లుక్ అదుర్స్
మేనల్లుడి వివాహ వేడుకలో సుష్మితా సేన్... ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా డిజైన్ చేసిన బ్లాక్ సారీలో అందంగా మెరిసిపోయారు. వివాహ వేడుకలో సుష్మితా సేన్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిపోయారు.

వధువుతో కలిసి...
పెళ్లి వేడుకలో వధువు రుక్మణ్‌తో కలిసి దిగిన ఫోటోను సుష్మితా షేర్ చేశారు. ఈ సందర్భంగా శివ్-రుక్మణ్‌లకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.


Click it and Unblock the Notifications











