సినీ, బుల్లితెర పరిశ్రమల్లో విషాదం: ప్రముఖ నటుడు కన్నుమూత
ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ, బుల్లితెర ఇండస్ట్రీల్లోనూ వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి. ఈ రెండు మూడు నెలల వ్యవధిలోనే ఎన్నో మంది పెద్ద పెద్ద నటులు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు ఇలా ఈ రంగంతో సంబంధం ఉన్న చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అందులోనూ హార్ట్ ఎటాక్ కారణంగా పలువురు కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్‌కు చెందిన సీనియర్ నటుడు, టెలివిజన్ స్టార్ రితురాజ్ సింగ్ మరణించారు. ఈ విషయాన్ని కొందరు సీనియర్ నటులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
దాదాపు మూడు దశాబ్దాలకు పైగానే సినిమాల్లో, సీరియళ్లలో నటించి పేరు తెచ్చుకున్న రితురాజ్ సింగ్ (59) గత రాత్రి గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. అయినప్పటికీ ఆయనను దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. రితురాజ్ మరణాన్ని అక్కడి వైద్యులు ధృవీకరించారని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలిసింది. ఈయన మరణంపై సినీ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

ఇక, రితురాజ్ సింగ్ మరణంపై ఆయన సన్నిహితులు కీలక విషయాలు వెల్లడించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 'రుతురాజ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్యాంక్రియాటిక్ సమస్యల కారణంగా 15 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. అక్కడ కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. నిన్న ఆయన మళ్లీ అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడికి వెళ్లేలోపే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు' అని తెలిపారు.

ఇదిలా ఉండగా.. రితురాజ్ సింగ్ 1989లో వచ్చిన 'In Which Annie Gives It Those Ones' అనే టెలివిజన్ ఫిల్మ్‌తో యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎన్నో సీరియళ్లలో నటించారు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో సైతం నటించి మెప్పించారు. ఈ మధ్య కాలంలో అయితే ఎన్నో వెబ్ సిరీస్‌లలోనూ నటించారు. చివరిగా ఆయన 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' అనే వెబ్ సిరీస్‌లో కనిపించారు. అలాగే, 'అనుపమా' అనే సీరియల్‌లోనూ నటిస్తున్నారు. ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగింది.


Click it and Unblock the Notifications











