సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. 30 ఏళ్ళ వయసులోనే నటుడు మృతి!

సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్ గా ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యానికి గురైన విద్యాసాగర్ మరణించడంతో చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఇటీవల నార్త్ ఇండస్ట్రీలో మరొక యువ నటుడు మృతి చెందడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆ వివరాల్లోకి వెళితే.. అస్సామీ భాషలో పలు మ్యూజిక్ ఆల్బమ్స్ తో మంచి గుర్తింపును అందుకున్న కిషోర్ దాస్ ఇటీవల మృతి చెందాడు. అస్సామీ భాష లో 30 ఏళ్ళ ఈ నటుడు పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించాడు. కొన్ని సీరియల్స్ తో కూడా మంచి గుర్తింపును అందుకుని టెలివిజన్ రంగంలో కూడా కిషోర్ దాస్ ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే గత కొంతకాలంగా ఈ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న కిషోర్ గత ఏడాది పరీక్షలు చేయించుకో గా క్యాన్సర్ బారిన పడినట్లుగా నిర్ధారణ అయింది.

famous artist Assam actor Kishore Das has passed away

ఇక చికిత్సకోసం ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా వర్కౌట్ కాలేదు. అయితే ఆ విషయాన్ని ఈ నటుడు ఎవరికి కూడా చెప్పలేదు. ఇక రీసెంట్ గా తీవ్రస్థాయిలో అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులకు వైద్యుల వివరణ ఇచ్చారు. కిషోర్ దాస్ ఎక్కువగా మ్యూజిక్ ఆల్బమ్స్ తోనే అస్సామీ ప్రేక్షకులకు అలాగే నార్త్ స్టేట్స్ లో మంచి క్రేజ్ అందుకున్నాడు.

అలాగే గౌహతి ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో ప్రసారమయ్యే బిధాత, బంధున్, నెదేఖా ఫగన్ లో నటించడమే కాకుండా ప్రముఖ అస్సామీ టెలివిజన్ షోలలో కూడా వర్క్ చేశాడు. 30 ఏళ్ల వయసులోనే కిశోర్ దాస్ మరణించడంతో అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇక కిషోర్ దాస్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేశారు. అలాగే సోషల్ మీడియాలో కూడా అతని ఫాలోవర్స్ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నట్లు చెబుతున్నారు. అలాగే ఆయన ఆత్మ కూడా శాంతి చేకూరాలని నివాళులలర్పిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X