Satish Kaushik: సినీ రంగంలో తీవ్ర విషాదం.. డైరెక్టర్ కమ్ యాక్టర్ సతీష్ కన్నుమూత
గతంలో కంటే ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ ఇండస్ట్రీల్లోనూ వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతోన్నాయి. ఈ రెండు మూడు నెలల వ్యవధిలోనే ఎన్నో మంది పెద్ద పెద్ద నటులు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు ఇలా సినీ రంగంతో సంబంధం ఉన్న చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అందులోనూ హార్ట్ ఎటాక్ కారణంగా పలువురు కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్‌కు చెందిన సీనియర్ దర్శకులు, నటుడు, స్క్రీన్ రైటర్ సతీష్ కౌశిక్ మరణించారు. ఈ విషయాన్ని కొందరు సీనియర్ నటులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
దాదాపు నలభై ఏళ్లుగా దర్శకుడిగా, నటుడిగా, స్క్రీన్ రైటర్‌గా సేవలు అందించిన సతీష్ కౌశిక్ (66) గత రాత్రి గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. అయినప్పటికీ ఆయనను దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. సతీష్ కౌశిక్ మరణాన్ని అక్కడి వైద్యులు ధృవీకరించారని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలిసింది. సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ పోస్టు ద్వారా ఈ వార్త అందరికీ తెలిసింది. ఇక, ఈయన మరణంపై సినీ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

సతీష్ కౌశిక్ 1984లో వచ్చిన 'కథ సాగర్' అనే సీరియల్ ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. అలాగే, 1993లో Roop Ki Rani Choron Ka Raja అనే సినిమాతో దర్శకుడిగా ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అదే ఏడాది Jaane Bhi Do Yaaro మూవీతో సినిమా నటుడిగా మారారు. అప్పటి నుంచి దాదాపు నలభై ఏళ్లుగా డైరెక్టర్‌గా, యాక్టర్‌గా దాదాపు వంద వరకూ సినిమాలు చేశారు. అలాగే, బుల్లితెరపైనా తనదైన రీతిలో అలరించారు. 2021లో మోనాల్ గజ్జర్ నటించిన 'కాగజ్' ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా. ఇక, ఆయన 'ఎమర్జెన్సీ' అనే సినిమాలో నటిస్తున్నారు. అంతలోనే ఈ దుర్ఘటన జరిగింది.
ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితమే ఈ లెజెండరీ డైరెక్టర్ కమ్ యాక్టర్ సతీష్ కౌశిక్ హోళీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే కొందరు సెలెబ్రిటీలతో కలిసి సరదాగా గడిపారు. అంతలోనే ఇప్పుడు ఆయన కన్నుమూశారు. ఇక, సతీష్ కౌశిక్ అంత్యక్రియలు నటి సాయంత్రం జరుగుతాయని తెలిసింది.


Click it and Unblock the Notifications











