షారుఖ్ ఖాన్ కోసం 143 రోజులుగా ప్రయత్నం.. నడవలేని స్థితిలో వీరాభిమాని, ఏం జరిగిందంటే!

సినీ తారలని అభిమానులు దైవం కన్నా ఎక్కువగా ఆరాధిస్తుంటారు. వారిపై పిచ్చి అభిమానాన్ని పెంచుకుంటారు. ఒక్కసారైనా తమ అభిమాన నటుడిని చూస్తే చాలు అనుకునే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. ఈ తరహా వాతావరణం సౌత్ లో ఎక్కువగా ఉంటుంది. అలాగని నార్త్ లో పూర్తిగా లేదు అని చెప్పలేం. నడవలేని స్థితిలో జీవనం సాగిస్తున్న ఓ అభిమాని కూడా షారుఖ్ ఖాన్ ని చూడాలని పరితపిస్తున్నాడు. దీనితో తన సోదరుడిని షారుఖ్ ఖాన్ ఎలాగైనా కలిసే ఏర్పాటు చేయాలని ప్రయత్నం మొదలు పెట్టాడు. ఎట్టకేలకు అతడి ప్రయత్నం ఫలించి షారుఖ్ ఖాన్ స్పందించాడు.

మానసిక వికలాంగుడు

మానసిక వికలాంగుడు

మానసిక వికలాంగుడైన ఓ వ్యక్తి తన చివరి కోరికగా షారుఖ్ ఖాన్ ని కలుసులోవాలని భావించాడు. కానీ అతడు కదిలే స్థితిలో లేడు. ఆరోగ్యం బాగా క్షీణించి ఉంది. దీనితో తన సోదరుడు కోరిక నెరవేర్చేందుకు అమృత్ అనే యువకుడు ప్రయత్నం మొదలు పెట్టాడు. నేరుగా షారుఖ్ ని కలుసుకోలేడు కాబట్టి సోషల్ మీడియాని మార్గంగా ఎంచుకున్నాడు. వెంటనే ట్విటర్ ఖాతా ప్రారంభించాడు. డే 1, డే 2 ఇలా రోజుకొక ట్వీట్ చేస్తూ తన సోదరుడికి సంబందించిన వీడియోలో పోస్ట్ చేశాడు. రాజు మీట్స్ షారుఖ్ అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా జత చేశాడు.

143వ రోజు

143వ రోజు

ఇలా 142 రోజులు గడచిపోయాయి. కానీ షారుఖ్ కి ఆ సందేశం చేరలేదు. 143వ రోజు ఎట్టకేలకు షారుఖ్ ఖాన్ స్పందించాడు. తన సోదరుడి కోసం అమృత్ చేసిన ప్రయత్నం ఫలించింది. నా సోదరుడి వీడియోలు తీయడం మా అమ్మకు ఇష్టం లేదు. అయినా ఏం చేయను.. అతడి కోరిక నెరవేర్చడానికి ఇలా చేయక తప్పడం లేదు అంటూ రోజుకొక వీడియో పోస్ట్ చేసాడు. ఇన్ని రోజుల అతడి నిరీక్షణతో షారుఖ్ హృదయం కరిగిపోయింది.

సారీ అమృత్‌జీ

ఈ విషయం తెలిసిన వెంటనే షారుఖ్ ఖాన్ స్పందించాడు. సారీ అమృత్ జీ.. మీ అమ్మని అడిగానని చెప్పండి. త్వరలో మీ సోదరుడిని కలుస్తాను అని షారుఖ్ ఖాన్ సందేశం పంపాడు. ఓ మై గాడ్ ఎట్టకేలకు మీరు స్పందించారు. ట్విట్టర్ చాలా శక్తివంతమైన మాధ్యమం అంటూ అమృత్ తన సంతోషాన్ని తెలియజేశాడు. ఇలా అనారోగ్యంతో భాదపడుతున్న తమ అభిమానులని సినీ స్టార్స్ కలుసుకోవడం తరచుగా జరుగుతోంది.

వరుస పరాజయాలు

వరుస పరాజయాలు

ఇదిలా ఉండగా షారుఖ్ ఖాన్ నటిస్తున్న చిత్రాలు వరుసగా నిరాశ పరుస్తున్నాయి. షారుఖ్ చివరగా నటించిన జీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని ఎదుర్కొంది. తదుపరి షారుఖ్ రాకేష్ శర్మ బయోపిక్ చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రం నుంచి షారుఖ్ తప్పుకున్నాడని.. ఆ స్థానంలోకి యురి ఫేమ్ విక్కీ కౌశల్ వచ్చాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తేలాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X