సల్మాన్ ఖాన్ అభిమానా? మజాకా? ఎంత సాహసం చేశారో తెలిస్తే షాకే!
సినిమా నటులను అభిమానులు పిచ్చిగా ఆరాధించడం సినిమా పరిశ్రమలో కనిపిస్తుంటాయి. పలు సందర్భాల్లో ఫ్యాన్స్ తమకు నచ్చిన హీరోల కోసం సాహసాలకు ఒడిగట్టడం చూస్తుంటాం. తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అభిమాని, అసోంకు చెందిన భూపెన్ లిక్సన్ ఓ సాహసానికే ఒడిగట్టారు. గౌహతిలో జరిగే ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ హాజరువుతున్నారని తెలుసుకొన్న భూపేన్ కలుసుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నాడు.. ఇంతకు ఆ రికార్డు ఏమిటంటే..

600 కిలో మీటర్లు సైకిల్‌పై
తాను అమితంగా ప్రేమించే సల్మాన్ ఖాన్‌ను కలుసుకునేందుకు తన సొంత గ్రామం తిన్సుకియాలో సైకిల్ యాత్రను ఫిబ్రవరి 8న ప్రారంభించి ఫిబ్రవరి 13న గౌహతికి వస్తున్నారని తెలుసుకొన్నారు. ఈ సందర్బంగా భూపేన్ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్‌ను కలుసుకొనేందుకు జగున్ (తిన్సుకియా)లో ఫిబ్రవరి 8న నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఫిబ్రవరి 13న గౌహతికి చేరుకొన్నాను. దాదాపు 600 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణించాను అని తెలిపారు.

సైకిల్ హ్యాండిల్ టచ్ చేయకుండా
అయితే సాధారణంగా ప్రయాణిస్తే భూపేన్ ఘనత ఏముంటుంది కదా.. కానీ భూపర్ గంటకు 48 కిలోమీటర్ల వేగంతో దాదాపు గంటపాగు సైకిల్ హ్యాండిల్ టచ్ చేయకుండా ప్రయాణించడం ద్వారా రికార్డు సృష్టించారు. దాంతో ఆయన ఘనత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో చేరింది.

ఫిబ్రవరి 15న గౌహతిలో ఫిలింఫేర్
వార్షిక ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం గౌహతిలో ఫిబ్రవరి 15న జరుగనున్నది. ఈ కార్యక్రమం సంబంధించిన కర్టెన్ రైజర్ ఈవెంట్ ముంబైలో ఫిబ్రవరి 2 జరిగింది. దాదాపు 19 ప్రధాన క్యాటగిరీల అవార్డులకు సంబంధించిన నామినేషన్లను ఇప్పటికే ప్రకటించారు.

గల్లీబాయ్‌కి రికార్డు నామినేషన్లు
ఫిలింఫేర్ నామినేషన్లలో జోయా అఖ్తర్‌కు చెందిన గల్లీ బాయ్ చిత్రం 13 నామినేషన్లను సొంతం చేసుకొన్నది. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ కేటరిగిరిలో అవార్డులకు నామినేట్ అయింది. ఈ అవార్డుల కోసం చిచ్చోర్, గల్లీబాయ్, మిషన్ మంగళ్, యూరీ: ది సర్జికల్ స్ట్రైక్, వార్ చిత్రాలు పోటీ పడుతున్నాయి.


Click it and Unblock the Notifications











