twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ భామకు పబ్లిక్‌లో చేదు అనుభవం: సెల్ఫీ అడిగి ముద్దు పెట్టాడు.. తర్వాత రోజే అసలైన ట్విస్ట్

    |

    మిగిలిన దేశాలతో పోలిస్తే భారతదేశంలోని నటీ నటులకు ఫాలోయింగ్ ఎక్కువ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఇక్కడి వాళ్లను దైవాలుగా భావిస్తుంటారు. అంతేకాదు, వీలు చిక్కినప్పుడల్లా తమ అభిమానాన్ని చాటుకోడానికి ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో చిన్న ఆర్టిస్టుల నుంచి బిగ్ సెలెబ్రిటీల వరకు ఎన్నో ఇబ్బందులను కలిగిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది. తక్కువ సినిమాలే చేసినా ఎక్కువ పాపులర్ అయిన అర్షి ఖాన్‌కు ఓ కుర్రాడు ఏకంగా ముద్దు పెట్టేశాడు. ఆ తర్వాతే అసలైన ట్విస్ట్ జరిగింది. ఆ వివరాలు మీకోసం!

    బొడ్డు చూపిస్తూ సెగలు రేపిన పాయల్ రాజ్‌పుత్.. మరో రేంజ్‌లో సెక్స్ అప్పీల్

    ఆ దేశం నుంచి ఇండియాకు వచ్చింది

    ఆ దేశం నుంచి ఇండియాకు వచ్చింది

    అఫ్ఘానిస్థాన్‌కు పుట్టి.. నాలుగేళ్ల వయసులోనే ఇండియాకు వచ్చేసింది అర్షి ఖాన్. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చదువును పూర్తి చేసుకున్న ఈమె.. మోడల్ అవ్వాలన్న లక్ష్యంతో ముంబైలో అడుగు పెట్టింది. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె.. పలు యాడ్స్‌లో కూడా నటించింది. ఈ క్రమంలోనే ఆ రంగంలో చాలా కాలం పాటు తన హవాను చూపించి ఫేమస్ అయింది.

    30 రోజుల్లో ప్రేమించడం ఎలా హీరోయిన్ ఫోటోషూట్ వైరల్.. సరికొత్త అందాలతో

    రెండు సినిమాలే అయినా పాపులారిటీ

    రెండు సినిమాలే అయినా పాపులారిటీ

    మోడల్‌గా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే అర్షి ఖాన్.. హిస్టారిక్ 4డీ ఫిల్మ్ 'ద లాస్ట్ ఎంపరర్' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత తమిళంలో వచ్చిన 'మల్లి మిస్తు' అనే సినిమాను చేసింది. కేవలం రెండు చిత్రాల్లోనే నటించినా ఈమెకు మాత్రం పాపులారిటీ బాగానే దక్కింది. దీనికి కారణం మ్యూజిక్ వీడియోలు, టీవీ షోలలో పాల్గొనడమే అన్న విషయం తెలిసిందే.

    బ్రాలో అందాలను ఆరబోసిన హీనా పంచల్.. బికినీలో అదరగొట్టిన యువ హీరోయిన్

    బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ.. యమ ఫేమస్

    బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ.. యమ ఫేమస్

    మోడల్‌గా, నటిగా ఎనలేని గుర్తింపును దక్కించుకున్న అర్షి ఖాన్.. 2017లో ప్రసారం అయిన హిందీ బిగ్ బాస్ 11వ సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. అందులో చాలా రోజుల పాటు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. అదే సమయంలో గొడవల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇలాంటి వాటి వల్లే 83వ రోజు షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది.

    అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ

    వివాదాలతో సహవాసం.. హాట్ టాపిక్

    వివాదాలతో సహవాసం.. హాట్ టాపిక్

    అర్షి ఖాన్ కెరీర్ పరంగా ఎంత గుర్తింపును తెచ్చుకుందో.. అంతకు మించి వివాదాల కారణంగానే పాపులర్ అయింది. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో గొడవల్లో భాగం అయిన ఈమె.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయినప్పటికీ తరచూ ఎవరో ఒకరిపై ఆరోపణలు చేస్తూ.. సంచలనం అవుతోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. అందుకే ఆఫర్లు కూడా దక్కించుకోలేకపోయింది.

    పాలిటిక్స్‌లోకి ప్రవేశం.. అలా పోటీ చేసి

    పాలిటిక్స్‌లోకి ప్రవేశం.. అలా పోటీ చేసి

    సినిమాల పరంగా సక్సెస్ కాలేకపోయిన అర్షి ఖాన్.. కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసింది. అయితే, అందులో ఆమెకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి సైలెంట్‌గా ఉండిపోయిందీ వివాదాస్పదన నటి.

    సెల్ఫీ అడిగి ముద్దు పెట్టిన అభిమాని

    ఎప్పుడూ తన వ్యవహార శైలితో వార్తల్లో నిలుస్తూ వస్తున్న అర్షి ఖాన్‌కు తాజాగా ఓ అభిమాని ఊహించని షాక్ ఇచ్చాడు. ఆమె ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించగానే ఓ కుర్రాడు.. దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటానని అడిగాడు. అప్పుడామె ఫొటోకు రెడీ అవుతుండగానే అతడు చేతిపై ముద్దు పెట్టుకున్నాడు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

    Recommended Video

    ప్రభాస్‌ను పట్టేశా.. కాంట్రవర్సీ క్వీన్ ట్వీట్..!
    ఆ తర్వాతనే అసలైన ట్విస్ట్ జరగడంతో

    ఆ తర్వాతనే అసలైన ట్విస్ట్ జరగడంతో

    అభిమాని కారణంగా పబ్లిక్‌లోనే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న అర్షి కఖాస్ తర్వాతి రోజే అసలైన ట్విస్ట్ ఇచ్చింది. ఆ ఘటన జరిగిన మరుసటి రోజు ఆమె తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని షాకింగ్ న్యూస్ చెప్పింది. దీంతో అందరూ ఆ అభిమాని గురించి ఆలోచిస్తున్నారు. కోవిడ్ వచ్చిన అర్షిని ముద్దు పెట్టుకున్న అతడు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? అని వాకబు చేస్తున్నారు.

    English summary
    Arshi Khan is a Bollywood model, actress, internet celebrity, and reality television personality. Khan was a qualified Physiotherapist before she started pursuing a career in acting and modelling. Arshi joined the Indian National Congress party to contest the 2019 elections for Mumbai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X