సెల్ఫీ కోసం వచ్చి హీరోయిన్ మీద చేయి వేసిన యువకుడు.. ఊహించని పని చేసి షాకిచ్చింది
స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది సారా అలీ ఖాన్. తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఆమె ఎంతగానో కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని దూసుకుపోతోంది. దీంతో ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలతో బిబీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను సైతం దక్కించుకుంటోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్న ప్రేమ వ్యవహారంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం సారా ప్రవర్తించిన తీరే. ఇంతకీ ఆమె ఏం చేసింది.?

తొలి ప్రయత్నమే సూపర్ సక్సెస్
సారా అలీ ఖాన్ బాలీవుడ్‌లోకి వేసిన తొలి అడుగే సూపర్ సక్సెస్ అయింది. ఆమె తన తొలి సినిమా ‘కేదార్‌నాథ్'తోనే బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు అందుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ ఉత్సాహంతోనే అమ్మడు.. ‘టెంపర్' రీమేక్‌గా తెరకెక్కిన ‘సింబా'లో నటించి మెప్పించింది. దీని తర్వాత పలు చిత్రాలకు సంతకాలు చేసింది.

ప్రేమ వ్యవహారంతో హాట్ టాపిక్
సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ సినిమా కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నప్పటికీ.. ఆమె వ్యవహార శైలి మాత్రం వివాదాస్పదం అవుతూనే ఉంది. దీనికి కారణం సారా.. కార్తీక్ ఆర్యన్ అనే హీరోతో డేటింగ్ చేయడమే. వీళ్ల ప్రేమ వ్యవహారం బాలీవుడ్ అంతా తెలియడంతో ఈ జంట తరచూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది.

ఎన్నో సార్లు దొరికిపోయారు
సారా అలీ ఖాన్.. కార్తీక్ ఆర్యన్ ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసి పోయింది. ఆ తర్వాతి నుంచి వీళ్లిద్దరూ షూటింగ్ కోసం వెళ్లినప్పుడు.. బయట కూడా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అలాగే, ఎయిర్‌పోర్టులో సైతం పలుమార్లు దొరికిపోయారు. ఈ క్రమంలోనే వీళ్లు ఈ మధ్య పలుమార్లు కెమెరాల కంటికి కూడా చిక్కుతున్నారు.
మీద చేయి వేసిన ఫ్యాన్
తాజాగా సారా అలీ ఖాన్‌కు ముంబై ఎయిర్‌పోర్టులో ఊహించని అనుభవం ఎదురైంది. లోపలికి వెళ్తున్న క్రమంలో కొందరు ఆమెను సెల్ఫీలు అడిగారు. దీంతో ఆమె నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. అదే సమయంలో ఓ యువకుడు వచ్చి ఫొటో అడగ్గానే ఓకే చెప్పింది. అయితే, అతడు ఫొటో తీసే క్రమంలో ఆమెపై చేయి చేశాడు.

ఊహించని పని చేసింది
సెల్ఫీ కోసం వచ్చి మీద చేయి వేసినా సారా అలీ ఖాన్ నవ్వుతూ బదులిచ్చింది. తనతో అనుచితంగా ప్రవర్తించినప్పటికీ అతడిని ఏమీ అనలేదు. పైగా రెండు సార్లు సెల్ఫీకి ఫోజులిచ్చింది. దీంతో సంయమనం పాటించిన సారా పట్ల సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే సమయంలో సదరు యువకుడిని నెటిజన్లు బూతులు తిడుతున్నారు.
Recommended Video

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు
2009లో సైఫ్ అలీ ఖాన్ - దీపికా పదుకునే కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘లవ్ ఆజ్ కల్'. ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారు. ఇందులో సారా అలీ ఖాన్ - కార్తీక్ ఆర్యన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం కానుకగా 2020 ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు కూలీ నెం 1లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











