For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెల్ఫీ కోసం వచ్చి హీరోయిన్ మీద చేయి వేసిన యువకుడు.. ఊహించని పని చేసి షాకిచ్చింది

  By Manoj
  |

  స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది సారా అలీ ఖాన్. తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఆమె ఎంతగానో కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని దూసుకుపోతోంది. దీంతో ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలతో బిబీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను సైతం దక్కించుకుంటోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్న ప్రేమ వ్యవహారంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం సారా ప్రవర్తించిన తీరే. ఇంతకీ ఆమె ఏం చేసింది.?

  తొలి ప్రయత్నమే సూపర్ సక్సెస్

  తొలి ప్రయత్నమే సూపర్ సక్సెస్

  సారా అలీ ఖాన్ బాలీవుడ్‌లోకి వేసిన తొలి అడుగే సూపర్ సక్సెస్ అయింది. ఆమె తన తొలి సినిమా ‘కేదార్‌నాథ్'తోనే బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు అందుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ ఉత్సాహంతోనే అమ్మడు.. ‘టెంపర్' రీమేక్‌గా తెరకెక్కిన ‘సింబా'లో నటించి మెప్పించింది. దీని తర్వాత పలు చిత్రాలకు సంతకాలు చేసింది.

   ప్రేమ వ్యవహారంతో హాట్ టాపిక్

  ప్రేమ వ్యవహారంతో హాట్ టాపిక్

  సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ సినిమా కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నప్పటికీ.. ఆమె వ్యవహార శైలి మాత్రం వివాదాస్పదం అవుతూనే ఉంది. దీనికి కారణం సారా.. కార్తీక్ ఆర్యన్ అనే హీరోతో డేటింగ్‌ చేయడమే. వీళ్ల ప్రేమ వ్యవహారం బాలీవుడ్ అంతా తెలియడంతో ఈ జంట తరచూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది.

  ఎన్నో సార్లు దొరికిపోయారు

  ఎన్నో సార్లు దొరికిపోయారు

  సారా అలీ ఖాన్.. కార్తీక్ ఆర్యన్ ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసి పోయింది. ఆ తర్వాతి నుంచి వీళ్లిద్దరూ షూటింగ్ కోసం వెళ్లినప్పుడు.. బయట కూడా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అలాగే, ఎయిర్‌పోర్టులో సైతం పలుమార్లు దొరికిపోయారు. ఈ క్రమంలోనే వీళ్లు ఈ మధ్య పలుమార్లు కెమెరాల కంటికి కూడా చిక్కుతున్నారు.

  మీద చేయి వేసిన ఫ్యాన్

  తాజాగా సారా అలీ ఖాన్‌కు ముంబై ఎయిర్‌పోర్టులో ఊహించని అనుభవం ఎదురైంది. లోపలికి వెళ్తున్న క్రమంలో కొందరు ఆమెను సెల్ఫీలు అడిగారు. దీంతో ఆమె నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. అదే సమయంలో ఓ యువకుడు వచ్చి ఫొటో అడగ్గానే ఓకే చెప్పింది. అయితే, అతడు ఫొటో తీసే క్రమంలో ఆమెపై చేయి చేశాడు.

   ఊహించని పని చేసింది

  ఊహించని పని చేసింది

  సెల్ఫీ కోసం వచ్చి మీద చేయి వేసినా సారా అలీ ఖాన్ నవ్వుతూ బదులిచ్చింది. తనతో అనుచితంగా ప్రవర్తించినప్పటికీ అతడిని ఏమీ అనలేదు. పైగా రెండు సార్లు సెల్ఫీకి ఫోజులిచ్చింది. దీంతో సంయమనం పాటించిన సారా పట్ల సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే సమయంలో సదరు యువకుడిని నెటిజన్లు బూతులు తిడుతున్నారు.

  #CineBox : Jabardasth Effect On Nandamuri Balakrishna New Movie
  ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

  ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

  2009లో సైఫ్ అలీ ఖాన్ - దీపికా పదుకునే కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘లవ్ ఆజ్ కల్'. ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారు. ఇందులో సారా అలీ ఖాన్ - కార్తీక్ ఆర్యన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం కానుకగా 2020 ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు కూలీ నెం 1లో నటిస్తోంది.

  English summary
  Bollywood actress Sara Ali Khan is undoubtedly one of the most promising actresses in the industry today. Though the actress is only two-movie-old, she has already created a niche for herself in the tinsel town. The actress is not only adored for her acting chops and sartorial choices.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X