బాక్సాఫీస్ రిపోర్ట్: ఆ మూడు సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే..
బాలీవుడ్లో తెరకెక్కిన ఫన్నేఖాన్, కార్వాన్, ముల్క్ సినిమాలపై ముందు నుంచీ మంచి అంచనాలున్నాయి. అందుకు కారణం 'ఫన్నే ఖాన్'లో ఐశ్వర్యరాయ్, అనిల్ కపూర్ లాంటి టాప్ స్టార్లు నటించడం, 'కార్వాన్'లో ఇర్ఫాన్ ఖాన్ మెయిన్ రోల్ చేయడం, 'ముల్క్' సినిమాలో రిషి కపూర్, తాప్సీ లాంటి స్టార్స్ నటించడమే. ఈ మూడు సినిమాలు శుక్రవారం (ఆగస్టు 3)న గ్రాండ్‌గా విడుదలయ్యాయి.
ఈ మూడు సినిమాలపై ముందు నుండి మంచి హైప్ ఉన్నప్పటికీ బాక్సాఫీసు వద్ద రెస్పాన్స్ దారుణంగా ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెద్దగా జరుగలేదు. శుక్రవారం ఉదయం షోలకు యావరేజ్‌గా 15 శాతానికి మించి థియేటర్లు నిండలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ముల్క్, కార్వాన్ చిత్రాలతో పోలిస్తే... 'ఫన్నే ఖాన్' పరిస్థితి కాస్త బెటర్.
హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ పరిశీలకుడు సుమిత్ కడేల్ బాక్సాఫీసు వద్ద ఈ సినిమాల పరిస్థితిపై ట్వీట్ చేశాడు. కార్వాన్, ఫన్నే ఖాన్, ముల్క్ చిత్రాలకు మార్నింగ్ షోలకు రెస్పాన్స్ చాలా దారుణంగా ఉందని. కార్వాన్ మూవీకి 8-9%, ముల్క్ చిత్రానికి 12-13%, ఫన్నే ఖాన్ మూవీకి 12-15% మించి థియేటర్లు నిండలేదని తెలిపారు.

మ్యాట్నీ షోల పరిస్థితి కూడా అదే విధంగా ఉందట. ముల్క్, కార్వాన్ చిత్రాలకు 8-10% మించి థియేటర్లు నిండలేదు. అయితే 'ఫన్నే ఖాన్' మూవీకి పరిస్థితి బెటర్‌గా ఉంది. కానీ ఐశ్వర్యరాయ్, అనిల్ కపూర్ లాంటి పెద్ద స్టార్లు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో రెస్పాన్స్ లేక పోవడం గమనార్హం. ఫన్నే ఖాన్ తొలి రోజు రూ. 2 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ మూడు సినిమాలకు క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూస్ వచ్చినా... ప్రేక్షకుల్లో ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈవినింగ్ షోలు, వీకెండ్ షోలకు వచ్చే రెస్పాన్స్ బట్టి ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద నిలదొక్కుకుంటాయా? లేదా? అనేది తేలనుంది.


Click it and Unblock the Notifications











