twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐశ్వర్యరాయ్ మూవీ ‘ఫన్నేఖాన్’ టీజర్

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ మూవీ 'ఫన్నేఖాన్' కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. అందుకు కారణం ఐశ్వర్యరాయ్, అనిల్ కపూర్, రాజ్ కుమార్ రావ్ లాంటి స్టార్స్ ఇందులో నటిస్తుండటమే. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. అతుల్‌ మాంజ్రేకర్‌ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని రాకేశ్‌ ఓంప్రకాశ్‌ నిర్మిస్తున్నారు.

    టీజర్ ఆకట్టుునే విధంగా ఉంది. ఫన్నేఖాన్‌.. అంటే చాలా అర్థాలున్నాయి. ఆర్టిస్టు, సింగర్‌, మ్యూజిషియన్‌ లేక పూర్తిగా ఇడియట్‌. కానీ వీళ్లంతా ఫన్ పంచేవారు. ఈ కథ ఒకే దానిపై.. దీని అర్థాన్ని పూర్తిగా మార్చిన ఓ వ్యక్తిది' టీజర్లో చెప్పుకొచ్చారు.

    ఈ చిత్రానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. 1999లో 'తాల్‌' తర్వాత అనిల్ కపూర్, ఐశ్వర్యరాయ్ కలిసి నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో అనిల్ కపూర్ మ్యూజిషియన్‌గా, ఐశ్వర్య పాప్‌సింగర్‌ పాత్రలో, రాజ్ కుమార్ రావు మరో ఫన్నీ పాత్రలో ప్రేక్షకులను అలరించబోతున్నారు.

    Fanney Khan Teaser

    ఆగస్టు 3న ఆ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బెల్జియం చిత్రం 'ఎవ్రీబడీస్‌ ఫేమస్‌'కు హిందీ రీమేక్‌ ఇది. 2001లో ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్రంగా అకాడమీ అవార్డుకు నామినేట్‌ అయ్యింది.

    English summary
    Fanney Khan Teaser Released. Presenting the first look of Gulshan Kumar presents, a T-Series and ROMPL Production, upcoming Bollywood Movie ’Fanney Khan' Directed by Atul Manjrekar. Starring Anil Kapoor, Aishwarya Rai Bachchan and Rajkummar Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X