For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనుష్క శర్మ సెల్ఫీ వైరల్.. చేతికి ఉన్న వాచ్ ఎన్ని లక్షలో తెలుసా?

  |

  2017లో పెళ్లి చేసుకున్న అనుష్క- విరాట్‌ కోహ్లి దంపతులు ఈ ఏడాది జనవరి 11న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పాపకు వామికా అని పేరు కూడా పెట్టారు. అయితే మీడియాకు తమ బిడ్డను దూరంగా ఉంచాలని భావిస్తున్న ఈ దంపతులు ఇప్పటివరకు చిన్నారి ఫేస్ రివీల్ చేయలేదు. అయితే తాజాగా పాపతో కలిసి నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కొన్ని షేర్ చేయగా అందులో ఆమె వాచ్ ఇప్పుడు హైలైట్ అవుతుంది. దాని ధర గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  వామికా పుట్టి 6 నెలలు

  వామికా పుట్టి 6 నెలలు


  ‘‘తన ఒక్క చిరునవ్వుతో మా చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం మారిపోయింది. చిన్నారి పాప... నువ్వు మా జీవితాల్లో నింపిన ప్రేమ ఇలాగే కలకాలం ఉండిపోవాలి'' అంటూ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సతీమణి అనుష్క శర్మ.. తమ కూతురు వామికా గురించి కొద్ది రోజుల క్రితం ఒక పోస్ట్ పెట్టారు. వామికా పుట్టి 6 నెలలు పూర్తైన సందర్భంగా... ‘‘మన ముగ్గురికి హ్యాపీ 6 మంత్స్‌'' అంటూ చిన్నారితో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు.

   ముఖం కనబడకుండా

  ముఖం కనబడకుండా


  ముందు నుంచి ఫిక్స్ అయిన దాని ప్రకారం వామికాని గుండెల మీద ఆడిస్తూ అనుష్క ఆ ఫోటోలలో కనిపించగా, కోహ్లీ తన గారాలపట్టిని ముద్దు చేస్తూ కనిపించాడు. ఒక్క ఫోటోలో కూడా వామిక ముఖం కనబడకుండా అనుష్క జాగ్రత్త పడ్డారు. ఇక తన మమ్మీ విధులకు దూరంగా, విరాట్ తో గడపడానికి మంచి క్వాలిటీ టైం గడుపుతోంది ఈ భామ.

  అన్ని కళ్ళూ అక్కడే

  అన్ని కళ్ళూ అక్కడే

  ఇక తాజా ఫోటోలో, అనుష్క తన కొత్త హెయిర్ కట్ తో పాటు సూపర్ ఖరీదైన రోజ్ గోల్డ్ రోలెక్స్ వాచ్ ధరించి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అనుష్క బ్లాక్ టాప్‌లో వైట్ ప్రింట్ మరియు దానిపై కొన్ని జిప్‌లతో కూడిన టాప్ ధరించి కనిపిస్తుండగా, ఆమె రోజ్ గోల్డ్ రోలెక్స్ వాచ్ కూడా ధరించింది. దీంతో ఆమె గడియారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

  ఆమాత్రం ఉండాల్సిందే

  ఆమాత్రం ఉండాల్సిందే

  ఇప్పుడు వైరల్ అయిన ఫోటోలో, అనుష్క కాస్మో గ్రాఫ్ డేటోనా రోజ్ డయల్ 18 కె ఎవెరోస్ గోల్డ్ ఓస్టెర్ బ్రాస్లెట్ ఆటోమేటిక్ మెన్స్ వాచ్ ధరించింది. రోలెక్స్ వెబ్ సైట్ లో దీని ధార $ 65,879 ఉంది, ఇది సుమారు రూ .50 లక్షలన్న మాట. మరి ఒక హీరోయిన్, క్రికెటర్ వైఫ్ కి భార్య అంటే ఆ మాత్రం ఉండొద్దా మరి.

  సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే అనుష్క చివరిసారిగా 2018లో 'జీరో' సినిమాని నిర్మించింది. ఈ సినిమాలో నటులు షారుఖ్ ఖాన్ మరియు కత్రినా కైఫ్ కలిసి నటించారు. ఇక అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ 'పాతాల్ లోక్' మరియు నెట్‌ఫ్లిక్స్ మూవీ 'బుల్బుల్ నిర్మించి మంచి పేరు సంపాదించింది. ఇక ప్రస్తుతం ఆమె 'ఖాలా' అనే సినిమాను నిర్మిస్తోంది, ఇది దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ యొక్క తొలి చిత్రం.

  English summary
  In a viral photo, Anushka sharma is seen sporting a Cosmograph Daytona Rose Dial 18K Everose Gold Oyster Bracelet Automatic Men's Watch. here is the rate
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X