twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హృతిక్ మాజీ భార్య సోదరి ఇంట్లో కరోనా.. అధికారుల చొరవకు ఫిదా.. సోషల్ మీడియాలో ప్రశంసలు

    |

    ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19 లక్షల మంది కరోనా బారిన పడగా.. లక్షకు పైగా ప్రాణాలను కోల్పోయారు. వీటన్నంటిలో అగ్ర రాజ్యం అమెరికానే ముందుంది. కరోనాను కట్టడి చేయడంతో అమెరికా పూర్తిగా విఫలం అవుతోంది. మన దేశంలో కరోనా కట్టలు తెంచుకుని వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ పరిస్థితి విషమించిపోతోంది.

    శరవేగంగా కరోనా వ్యాప్తి..

    శరవేగంగా కరోనా వ్యాప్తి..

    మన దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 11 వేల కరోనా కేసులు బయటపడగా.. నాలుగు వందల మంది దాకా దుర్మరణం చెందారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించగా.. మళ్లీ మే 3 వరకు కొనసాగుతుందని ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోకెల్లా మహారాష్ట్రల్లో కరోనా తాండవం చేస్తోంది.

    ఫరాఖాన్ ఇంట్లో కరోనా..

    హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే ఖాన్ సోదరి, జువెలరీ డిజైనర్ ఫరాఖాన్ అలీ ఇంట్లో కరోనా కేసు బయట పడింది. ఆమె ఇంటి ఇంటి పనిమనిషికి కరోనా వైరస్ సోకింది ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ఫరాఖాన్ అలీ కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేసి వారిని సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచారు.

    అధికారుల చొరవ..

    అధికారుల చొరవ..

    ఆమె ఇంటి పనిమనిషికి కరోనా వైరస్ సోకడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వైద్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఫరాఖాన్ ట్వీట్ చేస్తూ.. ‘మా ఇంటి పనిమనిషికి కరోనా సోకిందని తేలడంతో అధికారులు అత్యంత వేగంగా ఆసుపత్రికి తరలించారు...వైద్యులు, అధికారులను ప్రశంసిస్తున్నా'ని పేర్కొంది.

    Recommended Video

    Sonam Kapoor Confirms Her Wedding Will Be Held At Her Home
    చూపిన మానవత్వం..

    చూపిన మానవత్వం..

    అధికారులు స్పందించిన విధానాన్ని ప్రశంసిస్తూ.. ‘అధికారులు కరోనా రోగిని తరలించిన విధానం అద్భతంగా ఉంది. వారు దయ, మానవత్వంతో వ్యవహరించారు' అని ఫరాఖాన్ ట్వీట్ చేసింది. నిన్నటి బాంద్రా ఘటనపైనా ఫరాఖాన్ స్పందించింది. వలస కార్మికులంతా బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద గుమి గూడటాన్ని ఖండించింది.

    English summary
    Farah Khan ALi maid Gets Corona Positive. Have to say the mybmc &their docs in Mumbai is amazing with dealing with Covid patients. The way they handled the situation & picked up my staff and took him to a facility was swift & timely. They showed kindness & humanity & treated him with dignity. Way to go
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X