సుశాంత్ ప్రశాంతంగా నిద్రపో.. నీ చుట్టూ రాబందులు.. ఫర్హాన్ అఖ్తర్ సెన్సేషనల్ ట్వీట్
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణవార్తను జీర్ణించుకోలేని అతడి శ్రేయోభిలాషులు, సన్నిహితులు, స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ట్వీట్లు, కవితలు, భావోద్వేగమైన సందేశాలతో హోరెత్తిస్తున్నారు. కంగన రనౌత్, శేఖర్ కపూర్ లాంటి ప్రముఖుల తర్వాత దర్శక, నిర్మాత, నటుడు ఫరాన్ అఖ్తర్ ఘాటుగా స్పందించారు. భావోద్వేగంతో కూడిన కవితను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఫరాన్ ట్వీట్ భారీ దుమారమే సృష్టించేలా కనిపిస్తున్నది. వివారాల్లోకి వెళితే...
Recommended Video

సుశాంత్‌కు అన్యాయం
బాలీవుడ్ పరిశ్రమ వ్యవహరించిన తీరు వల్ల సుశాంత్ సింగ్ మనస్తాపానికి గురయ్యారనే విషయాన్ని పలువురు ప్రముఖులు తమ ట్వీట్లలో పేర్కొంటున్నారు. సుశాంత్ మంచి సినిమాల్లో నటించినా అవార్డులు దక్కలేదు. ప్రశంసలు లభించలేవు. సినీ తారల పిల్లలు నటించిన సినిమాలు చెత్తగా ఉన్న సూపర్ హిట్ అంటూ ప్రచారం చేశారు. అవార్డుల కూడా వాటికే ఇచ్చారు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

ఇండస్ట్రీలో బంధుప్రీతిపై
బాలీవుడ్‌లో ఓ వర్గం మాఫియాలా వ్యవహరించడం వల్లే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాంటి ప్రతిభావంతులు తమ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. పరిశ్రమలో జరిగే మాటల దాడులను తట్టుకోలేక కెరీర్‌కు దూరంగా ఉంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గత రెండేళ్లుగా కంగన రనౌత్ లాంటి వాళ్లు నెపోటిజం (బంధుప్రీతి) ఫేవరిజం లాంటి వాటిని ఎత్తి చూపడం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సుశాంత్ మరణం తర్వాత ఈ ఆరోపణలు మరోసారి ఊపందుకొన్నాయి.

కుటుంబ సభ్యుల అనుమానాలు
ఆర్నేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకోవడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. మర్డర్ అంటూ కుటుంబ సభ్యులు ఆరోపించడం బాలీవుడ్‌ను కుదిపేసింది. పోస్టుమార్టం అనంతరం జూన్ 15వ తేదీ మధ్యాహ్నం ముంబైలో సుశాంత్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు పూర్తి చేశారు.

ఫర్హాన్ అఖ్తర్ కవితతో
ఈ క్రమంలో ఫర్హాన్ రాసిన కవిత సంచలనంగా మారింది. ఆయన తన కవితలో.. సోదరా.. ప్రశాంతమైన గాఢ నిద్రలోకి జారుకో.., రాబందులు నీ చుట్టు గుమ్మికూడనివ్వు, మొసళ్లు కన్నీళ్లు కార్చనివ్వు.. సర్కస్‌లో విదూషకుల మాదిరిగా కొందర్ని తమ ప్రదర్శనను కొనసాగించనివ్వు, నిన్ను ఇంకా తూలనాడనివ్వు, నీ వద్ద మోకరిల్లనివు.. ఇంకా నీ గురించి కీచురాళ్ల శబ్దాలు చేయనివ్వు, మనుషుల్లో ఇంకా అజ్ఞానం ఇంకా పెరుగనివ్వు.. ఇవేమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా దీర్ఘమైన నిద్రలోనే ఒదిగిపో. సుశాంత్ ఆత్మకు శాంతి కలుగాలి అంటూ ఫర్హాన్ ట్వీట్ చేశారు.

ఈ లోకం నుంచి త్వరగా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఫర్హాన్ అఖ్తర్‌ను తీవ్రంగా కలిచివేసినట్టు అర్ధం అవుతుంది. తన బాధను కవిత రూపంలో వెల్లడించి.. సోదరా.. నీవు ఈ లోకం నుంచి త్వరగా వెళ్లిపోయావు అంటూ ఫర్హాన్ బాధపడ్డారు. బాలీవుడ్ చిత్రసీమ నిర్లక్ష్యానికి సుశాంత్ గురయ్యారనే విషయాన్ని ఫర్హాన్ తన కవితాధోరణిలో ఎండగట్టడం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











