యువ హీరోయిన్‌తో ఫర్హాన్ అఖ్తర్ రెండో పెళ్లి.. నాలుగేళ్ల డేటింగ్ తర్వాత ఖండాలాలో!

బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత, డిస్టిబ్యూటర్ ఫర్హాన్ అఖ్తర్ రెండో వివాహం చేసుకొన్నాడు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఒంటరిగా ఉంటున్న ఫర్హాన్ కొద్దికాలంగా యువ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తూ వస్తున్నారు. అయితే కొద్దికాలంగా వారిద్దరూ వివాహం చేసుకొంటున్నారనే వార్తలు, ఊహగానాలకు ముగింపు పలుకుతూ ముంబైకి సమీపంలోని ఖండాలాలో శిభానీ, ఫర్హాన్ అఖ్తర్ ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వివరాల్లోకి వెళితే...

 2018 నుంచి డేటింగ్

2018 నుంచి డేటింగ్

ఫర్హాన్ అఖ్తర్, శిభానీ 2018 నుంచి డేటింగ్ చేస్తూ అఫైర్‌లో ఉన్నారు. తమ డేటింగ్ విషయాన్ని తమ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించారు. అయితే వారిద్దరూ సహజీవనం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఫర్హాన్ అఖ్తర్ విషయానికి వస్తే.. గతంలో అధునా భబానీతో వివాహం జరిగింది. వారిద్దరికి షక్యా, అఖీరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2017లో ఫర్హాన్, అధునా విడిపోయారు. అప్పటి నుంచి శిభానీతో డేటింగ్ చేస్తున్నారు.

 మీడియాలో రొమాంటిక్ లైఫ్

మీడియాలో రొమాంటిక్ లైఫ్

కొద్దికాలంగా శిభానీ, పర్హాన్ అఖ్తర్ రొమాంటిక్ లైఫ్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. వీరిద్దరి శృంగార విన్యాసాలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే సుదీర్ఘంగా సాగిన డేటింగ్ వ్యవహారానికి ముగింపు పలికేలా ఫిబ్రవరి 19న వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు.

 ఖండాలాలో పెళ్లి వేడుక

ఖండాలాలో పెళ్లి వేడుక

ఫర్హాన్ అఖ్తర్, శిభానీ పెళ్లికి ఖండాల ప్రాంతం వేడుకైంది. అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల మధ్య ఈ పెళ్లి వేడుకు ప్రైవేట్ కార్యక్రమంగా సాగింది. ఈపెళ్లికి ముందు మెహందీ, సంగీత్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలను శిభానీ సోదరి అనుషా దండేకర్ నిర్వహించారు. పెళ్లి వేడుకలు ఫిబ్రవరి 17 ప్రారంభమయ్యాయి. ఈ పెళ్లి వేడుకలో మెహందీ లాగ కే రఖ్నా పాటకు ఫర్హాన్, శిభానీ స్పెప్పులు వేశారు.

పెళ్లిలో భార్యతో కలిసి స్టెప్పులేసిన ఫర్హాన్

పెళ్లిలో భార్యతో కలిసి స్టెప్పులేసిన ఫర్హాన్

అమృతా అరోరా, హృతిక్ రోషన్, రాకేష్ రోషన్, సతీష్ కౌశిక్, సాకీబ్ సలీమ్, అనుషా, రియా చక్రవర్తి, శంకర్ ఎహసాన్ లాయ్, ఫర్హా ఖాన్, జోయా అఖ్తర్ తదితరులు హాజరయ్యారు. పెళ్లి రోజున శంకర్, ఎహసాన్, లాయ్ నిర్వహించిన సంగీత విభావరి అందర్నీ ఆకట్టుకొన్నది. ఈ సంగీత విభావరిలో దిల్ దడ్కనే దో చిత్రంలోని తుమ్ హో తో అనే పాటకు, జాన్ లెజెండ్ పాటిన ఆల్ ఆఫ్ మై పాటకు తన రెండో భార్యతో కలిసి స్టెప్పులు వేశారు.

పెళ్లి తర్వాత ఫస్ట్ ఫోటో వైరల్

పెళ్లి తర్వాత ఫస్ట్ ఫోటో వైరల్

ఇదిలా ఉండగా, శిభానీ దండేకర్, ఫర్హాన్ అఖ్తర్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత వారిద్దరికి సంబంధించిన తొలి ఫోటో మీడియాలో వైరల్ అయింది. పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలు షేర్ చేస్తున్న ఫోటోలు మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X