twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోయిన్‌తో ఎఫైర్ గురించి ఒప్పుకున్నాడు, ఫోటోతో సహా...

    |

    బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత పర్హాన్ అక్తర్ భార్య అధునా భబానితో 2016లో విడిపోయిన తర్వాత ఆయనపై చాలా రూమర్స్ వినిపించాయి. పలువురు హీరోయిన్లతో అతడికి ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా పర్హాన్ అక్తర్.... బాలీవుడ్ నటి శిబానీ దండేకర్‌తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు.

    చాలా కాలంగా ఈ ఇద్దరూ తమ ఎఫైర్ విషయం బయటపడకుండా, మీడియాకు చిక్కకుండా దాగుడుమూతలు ఆడారు. ఇలా మీడియా కంట పడకుండా తిరగడం కష్టం అవుతుందో? ఏమో? మొత్తానికి తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ అందరికీ తెలిసేలా చేశారు.

     ఫోటో పోస్టు చేసిన పర్హాన్ అక్తర్

    ఫోటో పోస్టు చేసిన పర్హాన్ అక్తర్

    తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో శిబానీ దండేకర్‌తో కలిసి దిగిన ఫోటో పోస్టు చేసిన పర్హాన్ అక్తర్... తన మనసు నిండా ఆమె నిండి ఉందనే అర్థం వచ్చేలా లవ్ సింబల్ పెట్టారు. అలా ఈ ఇద్దరూ తమ రిలేషన్ షిప్ విషయంలో ఓపెన్ అయ్యారు.

    ఇద్దరూ సూపర్ జోడీ

    ఇద్దరూ సూపర్ జోడీ

    వయసు పరంగా కూడా ఇద్దరూ సరైన జోడీ. పర్హాన్ అక్తర్ వయసు 44, శిబానీ దండేకర్ వయసు 38. పర్హాన్ అక్తర్ ఇంతకు ముందు తనకంటే వయసు ఎక్కువ ఉన్న హెయిర్ స్టైలిస్ట్ అధునా భబానీని 2000 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకుని 16 ఏళ్ల కాపురం అనంతరం విడిపోయాడు. 38 ఏళ్ల శిబానీ దండేకర్‌కు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు.

    శిబానీ దండేకర్

    శిబానీ దండేకర్

    శిబానీ దండేకర్ గతంలో వీడియో జాకీగా, సింగర్‌గా, యాంకర్‌గా పని చేయడంతో పాటు మోడలింగ్ కూడా చేశారు. చిన్నతనం నుండి విదేశాల్లో పెరిగిన మరాఠీ బ్యూటీ 2014లో టైమ్‌పాస్ సినిమా ద్వారా ఐటం గర్ల్‌గా బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. తర్వాత కొన్ని సినిమాలో చిన్న పాత్రలు పోషించింది. ప్రస్తుతం ‘భవేష్ జోషి' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.

     పర్హాన్ అక్తర్

    పర్హాన్ అక్తర్

    పర్హాన్ అక్తర్ ప్రస్తుతం ‘ది స్కై ఈజ్ పింక్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆయేషా చౌదరి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పర్హాన్ అక్తర్, జైరా వాసిమ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    Farhan Akhtar and girlfriend Shibani Dandekar have made their relationship official. Farhan has now posted a picture with Shibani on Instagram and the 44-year-old actor is all hearts for his girl.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X