రెండో వివాహానికి సిద్ధమైన ప్రముఖ నటుడు... ఆవిడ కూడా ముదురే!
2018లో ప్రియాంక చోప్రా, రణవీర్ సింగ్, దీపిక పదుకోన్, సోనమ్ కపూర్, నేహా ధూపియా, అంగద్ బేడీ తదితరుల పెళ్లి వేడుకలతో బాలీవుడ్ చిత్ర సీమ సందడిగా కనిపించింది. 2019 సైతం హిందీ చిత్ర సీమలో వరుస పెళ్లి భాజాలు మ్రోగబోతున్నాయి.
బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత పర్హాన్ అక్తర్ ఈ ఏడాది రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. తన మొదటి భార్య అధునా భబానితో 2016లో విడిపోయిన తర్వాత నటి శిబానీ దండేకర్‌తో ప్రేమలో పడ్డ పర్హాన్ కొంతకాలంగా ఆమెతో డేటింగ్ చేస్తున్నాడు. ఈ జంట తమ రిలేషన్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

పర్హాన్ పిల్లల నుంచి కూడా సుముఖత
పర్హాన్ అక్తర్ రెండో పెళ్లిపై అతడి పిల్లలు కూడా సుముఖంగానే ఉన్నారట. శిబానీ దండేకర్ వారితో బాగా కలిసిపోయిందని, తమ తల్లి స్థానంలోకి ఆమె రావడంపై సంతోషంగానే ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.

గతంలో పర్హాన్ మీద రూమర్స్
పర్హాన్-శిబానీ పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు కానీ.... పెళ్లి డేట్ ఎప్పుడనేది డిసైడ్ కాలేదు. శిబానీ కంటే ముందు పర్హాన్ అక్తర్... శ్రద్ధా కపూర్, అదితి రావు హైదరితో డేటింగ్స్ చేసినట్లు రూమర్స్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

సూపర్ జోడీ
పర్హాన్ అక్తర్ వయసు 44, శిబానీ దండేకర్ వయసు 38. పర్హాన్ అక్తర్ ఇంతకు ముందు తనకంటే ఏడేళ్ల ఎక్కువ వయసున్న ఉన్న హెయిర్ స్టైలిస్ట్ అధునా భబానీని 2000 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకుని 16 ఏళ్ల కాపురం అనంతరం విడిపోయాడు. శిబానీ దండేకర్‌కు ఇదే మొదటి వివాహం.

శిబానీ దండేకర్
శిబానీ దండేకర్ గతంలో వీడియో జాకీగా, సింగర్‌గా, యాంకర్‌గా పని చేయడంతో పాటు మోడలింగ్ కూడా చేశారు. చిన్నతనం నుండి విదేశాల్లో పెరిగిన ఈ మరాఠీ బ్యూటీ 2014లో టైమ్‌పాస్ సినిమా ద్వారా ఐటం గర్ల్‌గా బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. తర్వాత కొన్ని సినిమాలో చిన్న పాత్రలు పోషించింది. ప్రస్తుతం ‘భవేష్ జోషి' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











