ఆమెకు ఓటు వేయొద్దంటూ ట్వీట్... నవ్వుల పాలైన ప్రముఖ హీరో!

బాలీవుడ్ నటుడు పర్హాన్ అక్తర్ ఆదివారం (మే 19) ఉదయం చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. భోపాల్ బీజేపీ అభ్యర్థి ప్రగ్యా ఠాకూర్‌కు ఓటు వేయవద్దని ఆయన తన ట్విట్టర్ ద్వారా కోరారు. ఈ ట్వీట్ చేసిన వెంటనే అక్తర్ మీద ట్రోలింగ్ మొదలైంది. అందుకు కారణం.... భోపాల్‌లో వారం రోజుల క్రితం(మే 12) పోలింగ్ ముగియడమే.

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఆదివారం చివరి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 59 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే భోపాల్‌లో పోలింగ్ పూర్తయిన విషయం తెలియక పర్హాన్ అక్తర్ ట్వీట్ చేశారు.

మీ నగరాన్ని కాపాడుకోవాలంటూ ట్వీట్

మీ నగరాన్ని కాపాడుకోవాలంటూ ట్వీట్

‘‘ప్రియమైన భోపాల్ ఓటరు మహాశయులారా... మీ నగరాన్ని కాపాడుకోవడానికి ఇదే సరైన సమయం. లేకుంటే గ్యాస్ ట్రాజెడీ లాంటి మరో విషాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రగ్యాకు ఓటు వేయవద్దు, గాడ్సేను దేశభక్తులు అన్న వారికి మద్దతు ఇవ్వవద్దు. మహాత్మగాంధీని గుర్తు చేసుకుందాం. మనుషులను ప్రేమించడం నేర్చుకుందాం... ద్వేషించడం కాదు'' అంటూ అంటూ అక్తర్ ట్వీట్ చేశాడు.

నవ్వుల పాలైన హీరో

నవ్వుల పాలైన హీరో

అయితే ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయో కూడా అవగాహన లేకుండా పర్హాన్ అక్తర్ చేసిన ట్వీట్ చివరకు అతడిని నవ్వుల పాలయ్యేలా చేసింది. చాలా మంది ఆయన్ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. అక్తర్ బాబూ... నువ్వు చాలా లేటుగా స్పందించావు, ఆల్రెడీ వారం క్రితమే భోపాల్ పోలింగ్ జరిగింది. ఇదే ట్వీట్ 2024లో రీట్వీట్ చేయ్ అంటూ నెటిజన్లు సెటైర్లు చేశారు.

ట్వీట్ డిలీట్ చేయకుండా అలాగే..

ట్వీట్ డిలీట్ చేయకుండా అలాగే..

తన ట్వీట్ మీద విమర్శలు వస్తున్నప్పటికీ... ప్రగ్యా ఠాకూర్ గురించి తాను చేసిన ట్వీట్ డిలీట్ చేయకుండా అలాగే ఉంచారు అక్తర్. తన ట్వీట్ కనీసం ఇతర ప్రాంతాల్లో అయినా గాడ్సేను దేశ భక్తుడిగా పొగడ్తలు గుప్పించే పార్టీలపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశ్యంతోనే డిలీట్ చేయలేదని తెలుస్తోంది. ఈ ట్వీట్ మీద కొందరు బూతులు మాట్లాడుతూ కామెంట్లు చేస్తున్నా అక్తర్ అవేమీ పట్టించుకోవడం లేదు.

పర్హాన్ అక్తర్

పర్హాన్ అక్తర్

పర్హాన్ అక్తర్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం స్కై ఈజ్ పింక్ అనే చిత్రం చేస్తున్నాడు. సోనాలి బోస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా లీడ్ రోల్ చేస్తున్నారు. జైరా వాసిమ్ కీలకమైన పాత్రలో నటిస్తోంది. అక్బోబర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X