బాల్యంలోనే నాపై అత్యాచారయత్నం.. కోరికలు తీరుస్తే ఆఫర్లలంటూ నిర్మాతలు.. బాంబు పేల్చిన యువ హీరోయిన్

దంగల్ చిత్రంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకొన్న ఫాతిమా సనా షేక్ తన జీవితంలో జరిగిన చేదు విషయాన్ని ఇటీవల మీడియాతో పంచుకొన్నారు. లైంగిక వేధింపులపై ఆమె స్పందిస్తూ తన బాల్యంలో జరిగిన దారుణమైన సంఘటనను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. తాజాగా జాతీయ మీడియాతో ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ..

 పక్కలోకి వస్తేనే ఆఫర్లు

పక్కలోకి వస్తేనే ఆఫర్లు

సినీ పరిశ్రమలో దారుణమైన సంఘటనలు ఎదుర్కొన్నాను. పక్కలోకి వస్తేనే ఆఫర్లు ఇస్తామని కొందరు సినీ ప్రముఖులు నన్ను వేధించారు. వారిని లైంగికంగా సంతృప్తి పరిస్తే గానీ సినిమా అవకాశం ఇవ్వమని చెప్పారు. కొన్నిసార్లు ఆఫర్లు ఇచ్చి కూడా మళ్లీ గుంజేసుకొన్నారు. కొన్నిసార్లు ప్రాజెక్టులోకి తీసుకొని.. ఆ తర్వాత మరో హీరోయిన్‌ను తీసుకొన్న దాఖలాలు చాలా ఉన్నాయి అని ఫాతిమా చెప్పారు.

మూడేళ్ల వయసులోనే అత్యాచారయత్నం

మూడేళ్ల వయసులోనే అత్యాచారయత్నం

సినీ పరిశ్రమలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. నా బాల్యంలోనే నాపై అత్యాచారయత్నం జరిగింది. నేను మూడేళ్ల వయసు ఉన్నప్పుడు నాపై ఓ వ్యక్తి రేప్‌కు ప్రయత్నించారనే విషయాన్ని నా తల్లిదండ్రులు చెప్పినప్పుడు వణికిపోయాను అని ఓ భయంకరమైన సంఘటనను ఫాతిమా సనా షేక్ చెప్పారు.

 దేశంలో మార్పులు వస్తున్నాయి

దేశంలో మార్పులు వస్తున్నాయి

దేశంలో సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన పెరుగుతున్నది. మహిళల్లో కూడా లైంగిక విషయాలపై ఎడ్యుకేట్ అవుతున్నారు. ఒకప్పుడు మాట్లాడటానికి బూతుగా భావించే సెక్స్‌ను బహిరంగంగా చర్చించే పరిస్థితులు వచ్చాయి. సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన పెరిగితే లైంగిక దాడుల కంట్రోల్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

షారుక్ ఖాన్‌తో కలిసి నటించే అవకాశం ఇవ్వండి

షారుక్ ఖాన్‌తో కలిసి నటించే అవకాశం ఇవ్వండి

ఇక కెరీర్ విషయానికి వస్తే.. షారుక్ ఖాన్ చిత్రంలో నటించేందుకు ఫాతిమా సనా షేక్ ప్రయత్నిస్తున్నారు. రాజు హిరానీ రూపొందించే చిత్రంలో తనకు అవకాశం ఇవ్వమని తాజాగా ఓ రిక్వెస్ట్ పెట్టుకొన్నట్టు సమాచారం. అయితే షారుక్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని రాజు హిరానీ ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

ఫాతిమా సనా షేక్ కెరీర్

ఫాతిమా సనా షేక్ కెరీర్

దంగల్ తర్వాత ఫాతిమా సనా షేక్ అనుకున్నంతగా ముందుకు వెళ్లలేదు. ప్రస్తుతం కొన్ని బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. లుడో, సూరజ్ పే మంగళ్ భరీ అనే చిత్రాల్లో నటించారు. లాక్ డౌన్ కారణంగా వాటి రిలీజ్ వాయిదా పడింది. త్వరలోనే ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X