అమీర్‌ఖాన్‌తో అఫైర్‌పై మాట్లాడను.. ఖండించను: ఫాతీమా సనా.. ఆయనతో మూడో పెళ్లి కూడా!
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ రూపొందించిన దంగల్ చిత్రం ద్వారా ప్రేక్షకాదరణ మూటగట్టుకొన్న అందాలభామ ఫాతిమా సనా షేక్ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంలోనూ కీలకమైన పాత్రను దక్కించుకొన్నది. అయితే ఇటీవల కాలంలో అమీర్‌ఖాన్, ఫాతీమా సనా షేక్ మధ్య అఫైర్ కొనసాగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో వీరి బంధంపై అటు మీడియాలోనూ, ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశమైంది. తన అఫైర్ గురించి వస్తున్న వార్తలపై ఇటీవల ఫాతీమా సనా షేక్ స్పందించారు. ఆమె ఏమన్నారంటే..

ఖండించాల్సిన అవసరం లేదు
అమీర్‌ఖాన్‌తో అఫైర్ ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. రూమర్లుగానే చూడాలి. అలాంటి వాటిని నేను ఖండించాల్సిన అవసరం లేదు. చాలా దారుణంగా రాస్తున్నారు. టెలివిజన్‌లో వచ్చే వార్తలు నా తల్లి దృష్టిలో కూడా పడ్డాయి. అలాంటి వార్తల్లో ఏముందోనని తెలుసుకోవడానికి హెడ్‌లైన్స్ చదువుతాను అని ఫాతిమా షేక్ అన్నారు.

చాలా డిస్టర్బ్ అవుతాను
అమీర్‌ఖాన్‌తో అఫైర్ వార్తలు మీడియాలో కనిపించినప్పుడు చాలా డిస్ట్రర్బ్ అవుతాను. వాటికి వివరణ ఇవ్వాలని ఆవేశం వస్తుంది. కానీ అది తప్పు అని నాకు నేను ముందు వివరించుకొంటాను. ఎవరైనా ఇలాంటి వార్తలు వింటే కోపోద్రేకం కావడం సహజం. ఒకవేళ స్థిత ప్రజ్క్షత ఉంటే వాటిని పెద్దగా పట్టించుకోలేరు అని ఫాతిమా సనా షేక్ పేర్కొన్నారు.

అఫైర్‌పై నా వివరణ ఇదే
ఇప్పుడు మీడియా ముందు మాట్లాడే ఛాన్స్ వచ్చింది. అందుకే నేను అమీర్‌తో అఫైర్ వార్తలపై నా తరఫు నుంచి వివరణ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. నా మాటలను వేరే వాళ్లు ఏలా అర్థం చేసుకొన్నా, పెద్దగా పట్టించుకోను. ఇలాంటి వార్తలను చెప్పేవాళ్లు చెబుతూనే ఉంటారు. వాటివల్ల జీవితం ఆగిపోదు అన్నారు.

ఆయనకు ఓ కుటుంబం కూడా
అమీర్‌ఖాన్‌తో అఫైర్ అంటూ వార్తలు రాసేవాళ్లు కూడా నన్ను డైరెక్టుగా కలుస్తారు. వాళ్ల జాబ్‌ను వాళ్లు చేస్తారని భావిస్తాను. ఇలాంటి వార్తలు రాయడంతో వాళ్ల పనిపూర్తయిన తర్వాత చక్కగా నిద్రపోతారేమో. అమీర్‌ఖాన్‌తో మూడో పెళ్లి చేసేస్తారేమో. కానీ ఆయనకు కుటుంబం ఉందని మరచిపోవద్దు అని ఫాతీమా సనా షేక్ సెటైర్ వేశారు.

అపర్‌శక్తి ఖురానాతో కూడా లింకు
గతంలో దంగల్‌లో తనతో నటించిన అపర్‌శక్తి ఖురానాతో కూడా లింకు ఉందని వార్తలు వచ్చాయి. వాటిని కూడా చేశాను. చూసి నవ్వడం తప్ప వాటి గురించి మాట్లాడటం వల్ల ఉపయోగం ఉండదు. నా జీవితంలో అమీర్, అపర్‌శక్తి లాంటి వాళ్లకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. రూమర్లు, గాసిప్స్ రాయడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఫాతీమా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











