For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నన్ను అలా వేధిస్తే చెంప పగలగొట్టా.. కానీ వాడు ఏం చేశాడంటే.. దంగల్ నటి ఎమోషనల్!

  |

  ఆడపిల్లలు రోడ్డు ఎక్కారంటే భద్రత లేకుండా పోతోంది. ఎప్పుడు, ఎవరు ఎక్కడి నుండి ఎలా ఎటాక్ చేస్తారో తెలియని పరిస్థితి. తాజాగా దంగల్ నటి ఫాతిమా సనా షేక్ తన మీద జరిగిన దాడి ఘటన గురించి చెప్పుకొచ్చారు. మన దేశంలో చాలా కుటుంబాలు తమ కుమార్తెలను ఇంటి నుండి బయటకు వెళ్లి వారి కలలను సాదించడానికి అనుమతించవు, దానికి ఈవ్ టీజింగ్ ఒక ప్రధాన కారణం. దంగల్ సినిమాలో రెజ్లర్ గీతా ఫోగట్ పాత్రలో నటించిన ఫాతిమా సనా షేక్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమెను ఒక వ్యక్తి ఎలా గాయపరిచాడో వెల్లడించింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె ఈ వివరాలు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

   చెంప పగలకొట్టిన వెంటనే గుద్దాడు..

  చెంప పగలకొట్టిన వెంటనే గుద్దాడు..

  అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దంగల్ సినిమాలో రెజ్లర్ గీతా ఫోగట్ పాత్రలో నటించిన ఫాతిమా సనా షేక్ తాజాగా తనకు జరిగిన ఒక దురదృష్టకర సంఘటన గురించి మీడియాతో పంచుకుంది. తనను ఈవ్ టీజింగ్ చేసిన ఒక వ్యక్తి తనను తిరిగి తనను గుద్దాడు అని చెప్పుకొచ్చింది. తాను జిమ్ కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అక్కడ ఒక అతను తనను చూస్తూ నిలబడ్డాడు అని దీంతో తాను అతని వద్దకు వెళ్లి ఏం చూస్తున్నావు అని అడిగాను అని చెప్పుకొచ్చింది. నా ఇష్టం నేను చూస్తాను అని అతను సమాధానమివ్వడంతో తనకు కోపం వచ్చి ఏం చెంప దెబ్బలు తింటావా అని అడగగా అతను అవును తింటాను, కొట్టమని ఎదురు తిరిగాడని ఆమె పేర్కొన్నారు.

  ఎవడ్రా నా కూతుర్ని ముట్టుకుంది

  ఎవడ్రా నా కూతుర్ని ముట్టుకుంది

  దీంతో తాను సంయమనం కోల్పోయి అతని చెంప మీద చెళ్లుమనిపించానని, దీంతో అతను కూడా వెంటనే తనను ఒక్క పంచ్ ఇచ్చి గుద్దాడని అని చెప్పుకొచ్చింది. ముందు పడిపోయానని ఏమీ అర్థం కాలేదని తర్వాత వెంటనే తేరుకుని తన తండ్రికి ఫోన్ చేశానని ఆమె చెప్పుకొచ్చింది. వెంటనే నాన్న అక్కడికి వచ్చాడు ఆయన వెంట మరో ఇద్దరిని తీసుకురావడంతో వాళ్లను చూసి అతను పారిపోయాడు అని ఆమె చెప్పుకొచ్చింది. తన తండ్రి కూడా కోపంగా వచ్చి ఎవడ్రా నా కూతుర్ని ముట్టుకుంది అంటూ అతని వెంట పరుగెత్తారని ఆమె చెప్పుకొచ్చింది.

   మూడేళ్ళ ప్రాయంలోనే లైంగిక వేధింపులు

  మూడేళ్ళ ప్రాయంలోనే లైంగిక వేధింపులు

  ఇక గతంలో కూడా ఆమె లైంగిక వేధింపుల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. మూడేళ్ల ప్రాయంలోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె పేర్కొంది. తన జీవితంలోనూ మర్చిపోలేని భయంకరమైన అనుభవాలు ఉన్నాయంటూ మూడేళ్ల వయస్సులోనే వేధింపులకు గురైన వైనాన్ని ఆమె చెప్పుకొచ్చింది. లైంగిక వేధింపుల గురించి మాట్లాడడానికే మహిళలు భయపడతారని.. అటువంటి విషయాలు ప్రస్తావించొద్దు ప్రస్తావిస్తే పరువు పోతుందనే ప్రపంచంలో మనం బతుకీడుస్తున్నామని ఫాతిమా అసహనం వ్యక్తంచేసింది. అందుకే మహిళలు ఎవ్వరూ ధైర్యంగా లైంగిక వేధింపుల గురించి మాట్లాడరు అని ఆమె చెప్పుకొచ్చింది.

  Akhanda Vs Acharya Vs Narappa, హీరోల లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా !
  అరువి హిందీ రీమేక్ లో లీడ్ రోల్

  అరువి హిందీ రీమేక్ లో లీడ్ రోల్

  చివరగా ‘లూడో' సినిమాలో కనిపించిన సనా, ఆ సినిమాలో పింకీ జైన్‌గా ఆడియన్స్‌ను మెప్పించింది. కాగా ఇప్పుడు తమిళ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అరువి' హిందీలో రీమేక్ అవుతుండగా ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ కి ఆమె ఎంపికయింది. ఇ.నివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్, ఫెయిత్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూలై నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా 2021 ఎండింగ్‌ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

  English summary
  Actress Fatima Sana Shaikh in a recent interview revealed how she was stalked by a guy who punched her back and she blacked out.she said her father chased that man who punched her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X