Fighter హృతిక్ ఫైటర్ అందుకే డిజాస్టర్.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఆటాడుకొంటున్న నెటిజన్లు
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, అందాల భామ దీపిక పదుకోన్ జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఫైటర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. అంతేకాకుండా ఈ సినిమా కలెక్షన్లపై అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఫైటర్ సినిమా డిజాస్టర్ గురించి చేసిన కామెంట్స్‌పై నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ కామెంట్ల వివరాల్లోకి వెళితే..
ఫైటర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడటం లేదు. ఎందుకంటే.. 90 శాతం మంది ఇండియన్స్‌కు ఎయిర్‌పోర్టులు, వైమానికదళం గురించి అవగాహన లేదు. చాలా మందికి పాస్‌పోర్టులు కూడా లేవు. ఎయిర్ ట్రావెల్, దాని వెనుక విషయాలు సరిగా తెలియవు. అందుకే ఈ సినిమా ఆడలేదు అని సిద్దార్థ్ ఆనంద్ అన్నాడు.

అంతటితో సిద్దార్థ్ ఆనంద్ ఆగకుండా.. ఒప్పెన్‌హైమర్ సినిమా ఆడిందంటే.. 90 శాతం మంది భారతీయుకులకు న్యూక్లియర్ ఫిజిక్స్ మీద అవగాహన ఉంది. ఏక్ థా టైగర్ ఆడిందంటే.. రా ఏజెంట్స్ గురించి తెలుసు. జురాసిక్ పార్క్ సినిమా ఆడిందంటే.. వారు డైనోసార్స్‌ను సాధు జంతువులుగా పెంచుకొంటారు. అవతార్ సినిమా ఆడిందంటే.. 90 శాతం మంది భారతీయు నీటి అంతర్బాగంలో జీవిస్తారు అని సెటైర్స్ వేశారు.

సిద్దార్థ్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమన్నారు. ఆయన చెప్పిన విధానాన్ని ఇమిటేట్ చేస్తూ సింగం సినిమా ఆడిందంటే.. 90 శాతం మంది భారతీయు పోలీసులుగా పనిచేస్తున్నారు. మిషన్ మంగళ్ నడిచిందంటే.. 90 శాతం మంది భారతీయులకు రాకెట్ సైన్స్ గురించి బాగా తెలుసు అంటూ సెటైర్లు వేశారు.

భారతీయుల దేశభక్తిని సినిమా వాళ్లు కమర్షియల్ అంశాలకు వాడుకొంటున్నారు. సినిమా కథను బలంగా రుద్దుతున్నారు. నాసిరకంగా సినిమాను చేస్తున్నారు. అందుకే దేశభక్తితో వచ్చే సినిమాలు డిజాస్టర్లుగా మారుతున్నాయి అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











