రణ్‌బీర్ కపూర్‌ది రియల్ జుట్టు కాదు..విగ్గు.. రజనీకాంత్‌కే భయం లేదు.. నీకేందుకు.. సినీ ప్రముఖుడి సెటైర్
సినీ హీరోలు చాలా మంది విగ్గు పెట్టుకోవడం తెలిసిందే. పాత్రలకు తగినట్టు తమ అభిమానులను ఆకట్టుకొనేందుకు చాలా మంది విగ్గులు పెట్టుకొని నటిస్తుంటారు. ఇటీవల ప్రభాస్, మహేష్ బాబు విగ్గు వాడుతున్నారనే వార్తలు మీడియాలో హల్‌చల్ చేశాయి. తాజాగా బాలీవుడ్‌లో ప్రముఖ విమర్శకుడు, నిర్మాత, నటుడు కమల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో టాప్ హీరో హెయిర్ స్టయిల్ వెనుక సీక్రెట్‌ను బయటపెట్టారు. ఆయన తాజాగా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతున్నది. ఆయన వీడియోలో చెప్పిన విషయాలు ఏమిటంటే?
కమల్ ఆర్ ఖాన్ ఓ వీడియోను షేర్ చేస్తూ.. ఆలియ భట్, రణ్‌బీర్ కపూర్ ఓ ఈవెంట్‌కు వెళ్లగా.. తన భర్త జట్టును సవరించే ప్రయత్నం ఆమె చేసింది. అయితే నా జుట్టును టచ్ చేయొద్దు అంటూ వారించాడు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియోపై కమల్ ఆర్ ఖాన్ ఘాటుగా స్పందించారు. రణ్ బీర్ విగ్గు ధరించాడని సీక్రెట్ బయటపెట్టారు.

కమల్ ఆర్ ఖాన్ మాట్లాడుతూ.. జుట్టులో ఏదో పడిందని ఆలియా తీయబోయింది. అయితే నా జుట్టును పట్టుకోవద్దు వారించాడు. తన హెయిర్ ప్యాచ్ ఊడిపోతుందని బెదిరిపోయాడు. అందుకే ఆలియాను జట్టు ముట్టుకోవద్దని చెప్పాడు. తన హెయిర్ నిజం కాదని, అది విగ్ అని తెలిసిపోతుంది. ఎవరో షూట్ చేసి లీక్ చేస్తారనే ఉద్దేశంతోనే అలా చేశాడు అని కమల్ ఆర్ ఖాన్ అన్నాడు.
ఇక తన భార్యకు అది విగ్ అనే విషయం తెలియదా? బయట వ్యక్తులకు కూడా అది తెలుసు. ఆ జట్టు ఊడిపోతుందని ఎందుకు అనుకొన్నాడు? అయితే అందరూ హెయిర్ ప్యాచ్ పెట్టుకొంటారు. దాని విషయంలో సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో నీవొక్కడే విగ్ పెట్టుకొంటున్నావని అనుకోకు అని కమల్ ఆర్ ఖాన్ సెటైర్ వేశాడు.

రజనీకాంత్‌కు బట్టతల ఉంటుంది. ఆయన బయట తిరిగేటప్పుడు విగ్ పెట్టుకోడు. ఆయన ఎవడు ఏమనుకొంటాడో పట్టించుకోడు.మీరు చూస్తే చూడండి.. లేకపోతే లేదు అనే విధంగా తాను ఉండేలా ఉంటాడు. షూటింగ్ ఉంటేనే విగ్ పెట్టుకొంటాడు. లేదంటే పెట్టుకోడు. నీవు కూడా స్టార్ హీరోవు కదా.. నీవు ఎలా ఉంటావో అలా బయటకు వస్తే.. ఎవడేం పీక్కుంటాడు. నీ సినిమాలు చూసే వాళ్లు చూస్తూనే ఉంటారు అని కమల్ ఆర్ ఖాన్ అన్నాడు.


Click it and Unblock the Notifications











