మైనే ప్యార్ కియా నిర్మాత రాజ్‌కుమార్ బర్జాత్య కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్‌కుమార్ బర్జాత్య గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ముంబైలోని శ్రీహెచ్.ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
రాజశ్రీ ఫిల్మ్స్ ప్రొడక్షన్‌పై మైనే ప్యార్ కియా, హమ్ ఆఫ్ కే హై కౌన్, హమ్ సాత్ సాత్ హై, వివాహ్, ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి చిత్రాలను రాజ్‌కుమార్ బర్జాత్య చిత్రాలు నిర్మించారు. హమ్ ఆప్ కే హై కౌన్ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఆయన నిర్మించిన చివరి చిత్రం 'హమ్ చార్' ఈ నెల 15న విడుదలైంది.

బాలీవుడ్లో అందరూ ఆయన్ను రాజా బాబు అని పిలుస్తుంటారు. రాజ్‌కుమార్ బర్జాత్య మరణంపై ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ స్పందిస్తూ.. ఆయన మరణ వార్తవిని షాకయ్యాను, వారి కుటుంబ సభ్యులు, కుమారుడు సూరజ్ బర్జాత్య, రాజశ్రీ పరివార్‌కు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
తన తండ్రి తారాచంద్ బర్జాత్య స్థాపించిన 'రాజశ్రీ ప్రొడక్షన్స్' బేనర్‌ను రాజ్‌కుమార్ బర్జాత్య విజయవంతంగా నడిపించారు. రాజ్‌కుమార్ బర్జాత్య కుమారుడు సూరజ్ భర్జాత్య దర్శకుడిగా కొనసాగుతున్నారు.


Click it and Unblock the Notifications