భవనంపై నుండి దూకి సినీ రచయిత ఆత్మహత్య

By Bojja Kumar

బాలీవుడ్ సినీ రచయిత రవిశంకర్ అలోక్ ముంబైలో ఎత్తైన భవనం నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో తన భవంతి పై అంతస్తుకు చేరుకున్న ఆయన, అక్కడి నుంచి దూకాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రవిశంకర్ పశ్చిమ అంధేరీలోని సెవన్ బంగ్లాస్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా సరైన అవకాశాలు లేక తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధ పడుతున్నాడని, మానసికంగా కృంగిపోయి చికిత్స తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

Film Writer Ravi Shankar Alok Dies Allegedly After Jumping Off Mumbai Building

నానా పటేకర్ నటించిన 'అబ్ తక్ చప్పన్' వంటి చిత్రాలకు కథా రచయితగా, పలు బాలీవుడ్ చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్‌గా రవి శంకర్ అలోక్ పని చేశారు. ఇతడి మరణం వెనక అసలు కారణాలు ఏమిటనే విషయమై సుబ్రుబాన్ వెర్సోవా పోలీసులు విచారణ ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X