ఫిల్మ్‌ఫేర్ అవార్డులు: పద్మావత్‌కు అవార్డుల పంట..రణ్‌బీర్ కపూర్, అలియా హల్‌చల్!
ప్రతిష్టాత్మకమైన 64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ముంబైలో కన్నుల పండువగా జరిగాయి. తారల తళుకుబెళుకులు, పవర్ ప్యాక్డ్ ఫెర్మార్మెన్స్‌తో వేదిక హోరెత్తింది. 2018లో ఉత్తమ చిత్రాల ఆధారంగా నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందజేశారు. ఈ అవార్డుల కార్యక్రమంలో రణ్‌బీర్, అలియాభట్ రచ్చ చేశారు. వివరాల్లోకి వెళితే...

ఉత్తమ చిత్రం రాజీ, నటిగా అలియా
ఉత్తమ చిత్రంగా రాజి నిలిచింది. ఈ చిత్రంలో నటించిన అలియాభట్‌కు ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకొన్నది. ఉత్తమ క్రిటిక్ చిత్రంగా అంధాధూన్ చిత్రం అవార్డును గెలుచుకొన్నది.

ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్
సంజూ చిత్రంలో అద్భుతంగా హావభావాలు పలికించిన రణ్‌బీర్ కపూర్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. క్రిటిక్స్ ఉత్తమ నటిగా నానీ గుప్తా బదాయి హో చిత్రానికి అవార్డు గెలుచుకొన్నారు. క్రిటిక్స్ ఉత్తమ నటుడిగా పద్మావత్ చిత్రానికి రణ్‌వీర్ సింగ్ అందుకొన్నారు.

ఉత్తమ క్యాటగిరీలలో అవార్డులు ఇవే
ఉత్తమ తొలి చిత్ర నటిగా సారా ఆలీఖాన్ - కేదార్ నాథ్
ఉత్తమ తొలి చిత్ర నటుడిగా ఇషాన్ కట్టర్ - బియాండ్ క్లైడ్స్
ఉత్తమ డైరెక్టర్‌గా మేఘనా గుల్జార్ - రాజి
ఉత్తమ డైరెక్టర్‌గా అమర్ కౌశిక్ - స్త్రీ
ఉత్తమ సహాయ నటుడిగా గజరాజ్ రావు - బాదాయి హో
ఉత్తమ సహాయ నటిగా సురేఖ సిక్రీ - బాదాయి హో

పద్మావత్ చిత్రానికి అవార్డులు
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్‌గా పద్మావత్
ఉత్తమ గాయకుడిగా అర్జిత్ సింగ్ - రాజి
ఉత్తమ గాయనిగా శ్రేయా ఘోషల్ - ఘూమార్ (పద్మావత్)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా కృతి మహేష్ ఘూమార్ (పద్మావత్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా పంకజ్ కుమార్ (తుమ్‌బడ్)
ఉత్తమ మాటల రచయితగా అశోక్ ఘిల్‌డియాల్ -బాదాయి హో
ఉత్తమ కథ రచయితగా అనుభవ్ సిన్హా - ముల్క్
ఉత్తమ నటుడిగా హుస్సేన్ దలాల్ - షేమ్ లెస్ (షార్ట్ ఫిల్మ్)
ఉత్తమ నటిగా కీర్తి కుల్హారి - మాయ (షార్ట్ ఫిల్మ్)


Click it and Unblock the Notifications











