Filmfare Awards: ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో చిన్న మూవీ హవా.. ఆ కపుల్‌కు జాక్‌పాట్.. యానిమల్‌కు ఎన్నంటే!
మిగిలిన రంగాలలో కంటే సినిమా ఫీల్డుకు సంబంధించి ఎన్నో అవార్డులను ప్రదానం చేస్తుంటారు. అలాంటి వాటిలో ఇండియాలో కొన్ని మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వాటిలో ఫిల్మ్‌ఫేర్ (Filmfare Awards) ఒకటి.
దేశంలోని పలు ఇండస్ట్రీలకు వేరు వేరుగా ఇచ్చే ఇది ఇప్పటికే 68 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 69వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్‌కు ఈ అవార్డులను అందించారు. మరి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎవరిని వరించాయో పూర్తి వివరాలు మీరే చూడండి మరి!

వైభవంగా ఫిల్మ్‌ఫేర్ వేడుక: ఇండియన్ సినిమాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే 'ఫిల్మ్‌ఫేర్' 69వ అవార్డుల కార్యక్రమం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నగరంలోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో బాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది స్టార్లు సందడి చేశారు. మరీ ముఖ్యంగా కొందరు నటీనటులు అదిరిపోయే ప్రదర్శనలు చేసి అందరినీ అలరించారు.
చిన్న చిత్రానికి అవార్డులు: తాజాగా ప్రకటించిన 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో చిన్న సినిమా '12th ఫెయిల్' మూవీకి అవార్డులు పోటెత్తాయి. చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీకి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులు లభించాయి. దీంతో ఈ సినిమా పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోతోంది.

యానిమల్ మూవీకి ఎన్ని?: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' మూవీ ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో 19 విభాగాల్లో నామినేట్ అయింది. అయితే, ఈ చిత్రం మాత్రం ఐదు అవార్డులను మాత్రమే అందుకుంది. అందులో బెస్ట్ హీరో, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్, బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్, బెస్ట్ సౌండ్ డిజైన్ విభాగాలు ఉన్నాయి.

భార్య భర్తలకు అవార్డులు: తాజాగా ప్రకటించిన 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్ (యానిమల్) ఎంపికయ్యాడు. క్రిటిక్స్ చాయిస్‌లో మాత్రం విక్రాంత్ (12th ఫెయిల్)ను ఇది వరించింది. అలాగే, ఉత్తమ నటిగా ఆలియా భట్ (రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ) ఎంపిక అయింది. క్రిటిక్స్ చాయిస్‌లో మాత్రం రాణీ ముఖర్జీ, షెఫాలీ షాలు ఉత్తమ నటిగా ఎంపిక అయ్యారు.

ఫిల్మ్‌ఫేర్ అవార్డుల పూర్తి లిస్ట్
ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): జోరమ్
ఉత్తమ దర్శకుడు: వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ నటుడు: రణ్‌బీర్ కపూర్ (యానిమల్)
ఉత్తమ నటి: ఆలియా భట్ (రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ చాయిస్): విక్రాంత్ (12th ఫెయిల్)
ఉత్తమ నటి (క్రిటిక్స్ చాయిస్): రాణీ ముఖర్జీ, షెఫాలీ షా
ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్ (డంకీ)
ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ)
ఉత్తమ కథ: అమిత్ రాయ్ (ఓ మై గాడ్ 2)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ బ్యాగ్రౌండ్ స్కోర్: హర్షవర్థన్ రామేశ్వర్ (యానిమల్)
ఉత్తమ గేయ రచయిత: అమితాబ్ భట్టాచార్య (తేరే వాస్తే)
ఉత్తమ గాయకుడు: రామ్ మిరియాల (భూపిందర్ బాబల్- యానిమల్)
ఉత్తమ గాయని: శిల్పా రావు (జవాన్)
ఉత్తమ నూతన హీరో: ఆదిత్య రావల్ (ఫరాజ్)
ఉత్తమ నూతన నటి : అలీజే అగ్నిహోత్రి (ఫర్రీ)
ఉత్తమ నూతన దర్శకుడు: తరుణ్ దుడేజా (ఢక్ ఢక్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: అవినాష్ అరుణ్ ధవారే (త్రీ ఆఫ్ అజ్)
ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేష్ ఆచార్య


Click it and Unblock the Notifications











