నీ వయసు అంతే, నాతో పెట్టుకోకు... 26 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌తో 47 ఏళ్ల స్టార్ డైరెక్టర్ సరసాలు!
ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ మంగళవారం తన 47వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన గర్ల్‌ఫ్రెండ్ శుభ్రా శెట్టితో సరసాలాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టడం చర్చనీయాంశం అయింది. 26 ఏళ్ల శుభ్రా ఆయన వద్ద అసోసియేట్‌గా చేరి గర్ల్‌ఫ్రెండ్‌గా మారిపోయింది.
అనురాగ్ కశ్యప్‌ను విష్ చేస్తూ శుభ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నువ్వు 17,166 రోజులు జీవించావు. కీప్ గోయింగ్' అంటూ ఓ పోస్ట్ పెట్టింది. దీనికి అనురాగ్ కశ్యప్ రిప్లై ఇస్తూ... 'థాంక్యూ.. నువ్వు ఇప్పటి వరకు కేవలం 9,547 రోజులు మాత్రమే జీవించావు, నాతో పోటీపడే ప్రయత్నం చేయకు' అంటూ వ్యాఖ్యానించారు.

ఆమెతో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు ఒప్పుకున్నాడు
అనురాగ్ కశ్యప్ మొట్టమొదటిగా శుభ్రాతో కలిసి దిగిన ఫోటో 2015లో పోస్ట్ చేశారు. అయితే 2018 ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రమే ఆమెతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఒప్పుకున్నాడు. ‘‘నేను చాలా కాలం తరువాత రిలేషన్‌షిప్‌లోకి ఎంటరయ్యాను. ఇది ఇతరులకు సంబంధం లేని విషయం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ప్రేమలో ఉండాలి. ప్రేమలోని ఎమోషన్ అంటే నాకు చాలా ఇష్టం. 90 ఏళ్ళ వయసులో కూడా నేను ప్రేమలో ఉంటాను'' అని గతంలో ఆయన ఓ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
వినూత్నంగా విష్ చేసిన మాజీ భార్య
మరో వైపు అనురాగ్ కశ్యప్ మాజీ భార్య కల్కి కోచ్లిన్ కూడా అతనికి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తుపాకితో రంగులను షూట్ చేస్తున్నట్లు ఉన్న ఫోటో షేర్ చేసిన కల్కి కొచ్లిన్, "హ్యాపీ బర్త్ డే ఎకె -47, నువ్వు చాలా కాలం వైల్డ్, కలర్‌ఫుల్ సినిమాలు తీస్తూ ఉండాలి " అని ఆకాంక్షించారు.

ఇద్దరితో విడిపోయిన అనురాగ్ కశ్యప్
అనురాగ్ కుమార్తె ఆలియా కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన తండ్రితో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ విష్ చేసింది. "హ్యాపీ బర్త్ డే పాపా, నిన్ను చాలా ప్రేమిస్తున్నాను" అంటూ వ్యాఖ్యానించింది. అనురాగ్
మొదటగా ఎడిటర్ ఆర్తి బజాజ్‌ను వివాహం చేసుకున్నారు. 1997 నుండి 2009 వీరి వైవాహిక బంధం సాగింది. తర్వాత కల్కి కొచ్లిన్‌ను 2011లో పెళ్లాడి 2015లో విడిపోయారు.

అనురాగ్ కశ్యప్
అనురాగ్ కశ్యప్ వర్క్ విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ చిత్రం ఘోస్ట్ స్టోరీస్ కోసం నిర్మాతలు జోయా అక్తర్, దిబార్కర్ బెనర్జీ, కరణ్ జోహార్‌లతో కలిసి పనిచేస్తున్నారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో చివరగా వచ్చిన చిత్రం ‘మన్మర్జియాన్' 2018లో విడుదలైంది.


Click it and Unblock the Notifications











