ఆత్మహత్య చేసుకున్న ఫిల్మ్ మేకర్.. గతంలో మీటూ ఆరోపణలు!
కోల్‌కతాలో 48 ఏళ్ల అర్ఘ్యా బసు అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంతోష్‌పూర ప్రాంతంలో నివాసం ఉంటున్న అతడు మార్చి 1న ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.
కొన్ని రోజులుగా అర్ఘ్యా బసు డిప్రెషన్‌తో బాధ పడుతున్నాడని ఇరుగు పొరుగువారు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, పోస్ట్ మార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.

అర్ఘ్యా బసు గతంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో టీచర్‌గా పని చేశారు. 2017లో ఆయనపై సెక్సువల్ హరాస్మెంట్ ఆరోపణలు వచ్చాయి. తన #మీటూ స్టోరీలో భాగంగా ఓ ప్రముఖ ఫిల్మ్‌మేకర్ అర్ఘ్యా బసు మీద ఆరోపణలు చేశారు.
అర్ఘ్యా బసు స్నేహితుడు అంకుర్ దాస్ మాట్లాడుతూ.. ' లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తర్వాత అర్ఘ్యా బసు డిప్రెషన్లోకి వెళ్లిపోయారు, కుటుంబ సభ్యుల సలహా మేరకు ఏప్రిల్ 2018లో నెల రోజుల పాటు కౌన్సిలింగ్ తీసుకున్నారు. తర్వాత అతడు ఫ్రీలాన్స్ పనులు చేయడం మొదలు పెట్టారు. ఓ తమిళ, మరాఠి సినిమాను ఎడిటింగ్ చేశారు. అతడి ఆత్మహత్య నన్ను షాక్‌కు గురి చేసింది' అన్నారు.


Click it and Unblock the Notifications