twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ కన్నుమూత

    |

    ఇండియన్ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత మృణాల్‌ సేన్‌(95) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన కోల్‌కతాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

    1955 వచ్చిన 'రాత్‌భోరే' అనే చిత్రంతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టిన మృణాల్ సేన్... నీల్‌ అక్షర్‌ నీచే, పడాతిక్‌, భువన్‌ షోమే, అకాలర్‌ సాంధానే, ఏక్‌ దిన్‌ ప్రతిదిన్‌ లాంటి సినిమాలో తన ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు పద్మభూషణ్‌, దాదా సాహెబ్‌ ఫాల్కే లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. భారతీయ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో ఆయన ఒకరు.

    Filmmaker Mrinal Sen passed away

    మృణాల్‌ సేన్‌ మే 14, 1923లో బ్రిటిష్ ఇండియాలోని ఫరీదాబాద్‌లో(బంగ్లాదేశ్‌)లో జన్మించారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. కొంతకాలం పాత్రికేయుడిగా పని చేసిన అనంతరం కోల్‌కతాలోని ఓ ఫిలిం స్టూడియోలో సౌండ్ టెక్నీషియన్‌గా చేరారు. అలా ఆయన సినిమా రంగం వైపు అడుగులు వేశారు.

    Poll: 2018 ఉత్తమ తెలుగు చిత్రంPoll: 2018 ఉత్తమ తెలుగు చిత్రం

    మృణాల్‌ తెరకెక్కించిన చిత్రాలు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు అవార్డులు అందుకున్నాయి. 'ఖరీజ్‌' చిత్రం కేన్స్‌, వెనిస్‌, బెర్లిన్‌ చిత్సోత్సవాల్లో ప్రదర్శితమై పలు అవార్డులు దక్కించుకుంది. మృణాల్ సేన్ 1977లో 'ఒక ఊరి కథ' అనే తెలుగు చిత్రాన్ని సైతం తెరకెక్కించారు. గ్రామీణ జీవితంపై తీసిన ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు దక్కించుకుంది.

    మృణాల్‌ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బాలీవుడ్‌ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేశారు.

    English summary
    Legendary filmmaker Mrinal Sen, known for his contribution to Bengali parallel cinema, died sunday at his home in Kolkata. He was 95.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X