‘నేను సర్దార్ కావడం వల్లే ఫిల్మ్ మేకర్స్ రిజక్ట్ చేస్తున్నారు’
తాను సర్దార్(సిక్కు) కావడం వల్ల కొన్ని సార్లు బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు కోల్పోవాల్సి వస్తోందని ఫక్రే మూవీ నటుడు మన్జోత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్ సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన ఈ యంగ్ యాక్టర్ నేను టర్బైన్(సిక్కులు ధరించే తలపాగా) ధరించడం వల్ల సినిమాల్లో తిరస్కరణకు గురి కావడం బాధ కలిగిస్తుందని తెలిపారు.
'నేను సర్దార్ కావడం వల్ల తిరస్కరణకు గురయ్యాను. టర్బైన్ ధరించిన వారు తెరపై సీరియస్ పాత్రలు లేదా యాక్షన్ డ్రామాలు చేయలేరని చాలా మంది ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారు. టర్బైన్ ధరించిన వాళ్లు కేవలం కామెడీ పండించడానికే అనే భావన ఉండటం తనను ఎంతో బాధిస్తుంది' అన్నారు.

'మేము కూడా యాక్షన్ సీక్వెన్స్ చేయగలం, లవ్ సీన్లు చేయగలం, సెంటిమెంట్ సీన్లు పండించగలం. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్లు తమ సినిమాల్లో స్రిప్టు డిమాండ్ చేస్తేనే సర్దార్లను తీసుకుంటున్నారు. మాపై ఉన్న భావన తొలగించాలని నేను అనుకుంటున్నాను. ఫిల్మ్ మేకర్స్ ఆలోచనల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది' అన్నారు.
త్వరలో విడుదల కాబోతేన్న 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' మూవీలో మన్జోత్ సింగ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. మరో చిత్రం 'డ్రీమ్ గర్ల్' సెప్టెంబర్ 13న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో మన్జోత్ సింగ్ కీలకమైన పాత్రలో నటించాడు.


Click it and Unblock the Notifications