twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్ళను చాలా సార్లు ప్రైవేట్‌గా కలిశాను.. పాయల్ ఘోష్ వ్యాఖ్యలపై స్పందించిన అనురాగ్

    |

    నటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎట్టకేలకు దర్శకుడు అనురాగ్ కశ్యప్ ట్విట్టర్‌ ద్వారా వివరణ ఇచ్చారు. ఇటీవల ఒక న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయల్ ఘోష్ ఆ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ లో ప్రధాని మోడీని కూడా ట్యాగ్ చేసింది. తనకు సహాయం చేయాలని ఇలాంటి వ్యక్తులను ఏ మాత్రం వదిలిపెట్టకండి అంటూ జాతీయా మహిళ కమిషన్ సహాయాన్ని కూడా కోరింది.

    Recommended Video

    #PayalGhosh : Anurag Kashyap Responds To Payal Ghosh's Comments || Oneindia Telugu
    దేనికైనా కొంత పరిమితి ఉంటుంది

    దేనికైనా కొంత పరిమితి ఉంటుంది

    ఇక పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలపై ఎట్టకేలకు దర్శకుడు అనురాగ్ ఈ విధంగా వివరణ ఇచ్చారు... "వావ్, నన్ను నిశ్శబ్దం చేసే ప్రయత్నంలో చాలా సమయం తీసుకున్నారు. అది సరే గాని. నన్ను సైలెంట్ గా చేయలనే ప్రయత్నంలో, మీతో పాటు ఇతర మహిళలను కూడా లాగారు. దేనికైనా కొంత పరిమితి ఉంటుంది మేడమ్. మీరు ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ, అవన్నీ ఆధారాలు లేనివి అని చెప్పాలనుకుంటున్నాను.

     బచ్చన్ కుటుంబాన్ని కూడా

    బచ్చన్ కుటుంబాన్ని కూడా

    నాపై ఆరోపణలు చేసే ప్రక్రియలో మీరు నా కళాకారులను అలాగే బచ్చన్ కుటుంబాన్ని కూడా లాగడానికి ప్రయత్నించారు. కానీ చివరికి మీరే విఫలమయ్యారు. మేడమ్ నేను రెండుసార్లు వివాహం చేసుకున్నాను, అది నా నేరం అయితే నేను అంగీకరిస్తాను. దాన్ని ప్రేమిస్తాను కూడా. నేరం నాదైతేనే నేను అంగీకరిస్తున్నాను.

    వాళ్ళని చాలా సార్లు ప్రయివేట్ గా కలిశాను

    వాళ్ళని చాలా సార్లు ప్రయివేట్ గా కలిశాను

    నా మొదటి భార్య, రెండవ భార్య, నేను ప్రేమించిన ఇతర అమ్మాయిలు అలాగే నటీమణులతో నేను ఏనాడు తప్పుగా ప్రవర్తించలేదు. నేను పని చేసిన వారిలో మహిళా టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళని నేను చాలా సార్లు ప్రయివేట్ గా కలిశాను కూడా. కానీ నా పరిధిని దాటి నేను ప్రవర్తించలేదు. ఈ ఆరోపణలను నేను సహించలేను కూడా.

    క్షమాపణలు చెబుతున్నాను..

    క్షమాపణలు చెబుతున్నాను..

    ఏమైనా జరిగితే మనం చూద్దాం. నిజంగా నీ దృష్టిలో అది కనిపిస్తే అది ఎంతవరకు నిజమో? ఎంతవరకు అబద్దమో కూడా బయటపడుతుంది. మీపై నా ఆశీర్వాదాలు, ప్రేమ ఎప్పటికి ఉంటాయి. మీ ఇంగ్లీషు ఆరోపణలకు నా హిందీతో సమాధానం ఇచ్చినందుకు క్షమాపణలు చెబుతున్నాను.." అంటూ అనురాగ్ ట్విట్టర్ లో చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు.

    English summary
    Wow, it took so long in the attempt to silence me. It's ok. In the attempt to silence me, you dragged several other women despite being a woman yourself. Have some limit Madam. Will just want to say that whatever the accusations are, they are all unsubstantiated.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X