twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రికెటర్ ప్రేమలో స్టార్ నటుడి కుమార్తె.. పుట్టినరోజున పబ్లిక్ ప్రకటన చేసిన క్రికెటర్ !

    |

    బాలీవుడ్ నటి అతియా శెట్టి కొంతకాలంగా సినిమాల్లో కనిపించకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరచుగా తన అందమైన ఫోటోలు పంచుకుంటూ ఉంటుంది, అందుకే సోషల్ మీడియాలో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. నటనతో పాటు, అతియా తన వ్యక్తిగత జీవితానికి సంబందించి క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో డేటింగ్ వార్తలతో ఎక్కువ ఆమె పేరు వినిపిస్తూ ఉంటుంది. అయితే 2019 నుంచి వీరు డేటింగ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతూ ఉండగా ఎట్టకేలకు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే

    ప్రపంచానికి బహిరంగంగా

    ప్రపంచానికి బహిరంగంగా

    సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి, ఇండియన్ క్రికెటర్ కెఎల్ రాహుల్ ఇద్దరూ తరచుగా ఒకరి ఫోటో మీద మరొకరు లవ్ కామెంట్స్ చేసుతూ ఉంటారు. ఇద్దరూ తమ సంబంధాన్ని బహిరంగంగా ఇప్పటిదాకా అంగీకరించనప్పటికీ, అతియా పుట్టినరోజు సందర్భంగా, కెఎల్ రాహుల్ వారి రిలేషన్ వెల్లడించే విధంగా పోస్ట్‌ పంచుకున్నారు, ఇది వారు తమ సంబంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్లు భావించవచ్చు.

    పుట్టినరోజునే

    పుట్టినరోజునే

    అతియా నవంబర్ 5న తన పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా పరిశ్రమకు చెందిన వారందరి నుంచి అభినందనలు అందుకున్నారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన పోస్ట్ కేఎల్ రాహుల్ చేసింది. కేఎల్ రాహుల్ ట్విట్టర్‌లో తాను మరియు అతియా సరదాగా ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు మరియు దానితో పాటు 'శుభాకాంక్షలు నా లవ్ అతియా' అని క్యాప్షన్‌లో రాశారు.

    అప్పుడు కూడా

    అప్పుడు కూడా

    కొంతకాలం క్రితం అతియా శెట్టి ఇంగ్లాండ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి అక్కడ నుండి చాలా అందమైన చిత్రాలను పంచుకున్నారు. వారిద్దరి చిత్రాలు ఇంతకు ముందు కూడా ఇంగ్లాండ్‌లో కనిపించాయి, అయితే అతియా తన సోదరుడు అహన్ శెట్టితో కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్లినట్లు అతియా తండ్రి సునీల్ శెట్టి చెప్పారు. కానీ నివేదికల ప్రకారం, కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్‌లో తన మ్యాచ్ కోసం బయలుదేరినప్పుడు, తనతో పాటు అతియా శెట్టిని తీసుకువేలాది.

    పార్టనర్ అని చెప్పి

    పార్టనర్ అని చెప్పి

    ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు బీసీసీఐతో మాట్లాడిన సందర్భంగా కేఎల్ రాహుల్ తన స్నేహితురాలు అతియా శెట్టిని పిలిచాడు. ఈ సమయంలో, విమానాశ్రయంలోని ప్రతి ఆటగాడు అతను ఎవరితో ప్రయాణిస్తున్నాడో భాగస్వామి పేరును చెప్పాలి. రాహుల్ తన జోడీగా అతియా శెట్టిని పేర్కొన్నాడు. అప్పట్లో దీనిపై సునీల్ శెట్టిని ప్రశ్నించగా, 'మీరు అతనితో దీని గురించి మాట్లాడాలని నేను భావిస్తున్నానని తప్పించుకున్నారు. అన్నట్టు రాహుల్, అతియా కలిసి ఒక బ్రాండ్ ప్రమోషన్ లో కలవగా అలా వేరు ప్రేమ మొదలైందని చెబుతున్నారు.

    అలా చెప్పడంతో

    అలా చెప్పడంతో


    ఇక నిన్న జరిగిన ఇండియా వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనింగ్ జోడీ రోహిత్-రాహుల్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. కేఎల్ రాహుల్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు, ఇది యువరాజ్ సింగ్ తర్వాత భారత ఆటగాడు చేసిన వేగవంతమైన టీ20 అర్ధ సెంచరీ కూడా. ఈ మ్యాచ్ చూడడానికి అతియా శెట్టి కూడా వచ్చింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ తనతో పాటు అతియాతో ఉన్న రెండు చిత్రాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీని క్యాప్షన్‌లో అతను అతియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపాడు. అక్కడ హ్యాపీ బర్త్ డే మై లవ్ అని పేర్కొనడంతో వాళ్ళ ప్రేమను అధికారికంగా ప్రకటించినట్టే.

    English summary
    Athiya Shetty and KL Rahul make their relationship public.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X