twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ సోదరులపై FIR నమోదు.. చెప్పినా వినిపించుకోకుండా మొండిగా ప్రవర్తించారు

    |

    సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ బ్యాడ్ లక్కేమిటో గాని నిత్యం ఏదో ఒక వివాదంలో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటారు. కొన్నిసార్లు అతిగా ప్రవర్తించి వివిధ రకాల కేసులో ఇరుక్కున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే రీసెంట్ గా మరోసారి సల్మాన్ సోదరులపై కేసు నమోదైంది. ముంబై బీఎంసీ వైద్య అధికారులు వారిపై FIR నమోదు చేయడంతో ఒక్కసారిగా న్యూస్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

    కొవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించినందువల్లే..

    కొవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించినందువల్లే..

    కొవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించినందువల్లే వారిపై కేసు నమోదు చేశారు. బాలీవుడ్ సినీనటులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ పై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కేసు నమోదు చేసింది. కారోన్ వైరస్ ఎక్కువవుతున్న సమయంలో నిబంధలను ఏవరు అతిక్రమించినా సహించేది లేదని ఇదివరకే చాలా సార్లు ముంబై అధికారులు హెచ్చరించారు.

    కేసులు ఎక్కువవుతున్న సమయంలో..

    కేసులు ఎక్కువవుతున్న సమయంలో..

    అసలే ముంబైలో రోజురోజుకు కరోనా తీవ్రత మరింత ఎక్కువవుతోంది. లాక్ డౌన్ లోనే కేసులు లక్షల్లో పెరిగాయి. మహారాష్ట్రలో గ్రామాలు కూడా కోవిడ్ బారిన పడుతున్నాయి. అందుకే అక్కడి అధికారులు గత కొన్ని నెలలుగా మరింత జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే డిసెంబర్ లో సల్మాన్ సోదరులు నిబంధనలను ఉల్లంఘించారు.

    దుబాయ్ నుంచి వచ్చిన తరువాత

    దుబాయ్ నుంచి వచ్చిన తరువాత

    జనాలకు ప్రేరణగా నిలవాల్సిన వారే ఇలా అతిగా ప్రవర్తించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని విమర్శలు అందుకున్నారు. సోహైల్ ఖాన్ కుమారుడు కూడా అందులో ఉన్నారు. అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, నిర్వాన్ ఖాన్ లు 2020 డిసెంబర్ 25న దుబాయ్ నుంచి ముంబైకు తిరిగి వచ్చారు. అయితే ఆ సమయంలో క్వారంటైన్ లో తప్పనిసరిగా ఉండాలి.

    మొండిగా ప్రవర్తించారు

    మొండిగా ప్రవర్తించారు

    ఒక హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండకుండా ఇంటికి వెళ్లారని బీఎంసీ వైద్య అధికారి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారు 14రోజుల పాటు క్వారంటైన్ ఉండాల్సిందేనని ఎంత చెప్పినా కూడా వారు పట్టించుకోలేదని మొండిగా ప్రవర్తించారని బీఎంసీ వైద్యాధికారి పేర్కొన్నారు. అయితే విమానాశ్రయంలో పరీక్షల అనంతరం నెగిటివ్ వచ్చిన తరువాతే ఇంటికి వెళ్లినట్లు సోహైల్ ఖాన్ వివరణ ఇచ్చారు.

    English summary
    Salman Khan's family bad luck is always a hot topic in any controversy. There are also a lot of cases where you are sometimes overzealous and stuck in a variety of cases. Recently, however, a case was registered against the Salman brothers. Mumbai BMC medical officers have registered an FIR against them and it has become a hot topic in the news media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X