షబానా అజ్మీ కారు డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్.. నిలకడగా ఆరోగ్యం.. ప్రముఖుల పరామర్శలు
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి షబానా ఆజ్మీ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం మహారాష్ట్రంలోని రాయ్‌గడ్ జిల్లాలో ముంబై-పుణే జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఓసారి చూద్దాం..

అతి వేగం వల్లే..
అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిదంటూ ట్రక్ డ్రైవర్ రాజేష్ పాండురంగ విఠల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. షబానా అజ్మీ ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం తన ట్రక్కును ఓవర్‌టేక్ చేసే క్రమంలో వేగంగా ఢీకొట్టినట్లు అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

డ్రైవర్‌పై ఎఫ్ఐఆర్..
షబానా అజ్మీ కారు డ్రైవర్ అమ్లేష్ యోగేంద్ర కామత్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అతి వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు ఫైల్ చేసినట్టు పేర్కొన్నారు.

ప్రముఖుల పరామర్శలు..
షబానా అజ్మీ ప్రమాదానికి గురైన వార్త తెలిసిన వెంటన్ బాలీవుడ్ షాక్‌లోకి వెళ్లింది. ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో లతా మంగేష్కర్ ట్వీట్ చేస్తూ.. ‘షబానాకు యాక్సిడెంట్ అయిందని తెలుసుకోగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా'ని తెలిపింది.

భర్తకు గాయాలు..
షబానా అజ్మీకి ప్రమాదం జరిగినప్పుడు ఆమె భర్త, ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ ఆమె పక్కనే ఉన్నారు. అదృష్ణవశాత్తు ఆయనకు పెద్ద ప్రమాదమేమీ జరగలేదు.. చిన్న గాయాలతో బయటపడ్డారు. ఆయన ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. బాలీవుడ్‌లో ఆర్ట్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న షబానా. ఉత్తమ నటిగా 5సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. షబానా అజ్మీ స్వస్థలం హైదరాబాద్. ప్రముఖ నటి టబుకు ఈమె స్వయంగా మేనత్త.


Click it and Unblock the Notifications











