న్యూడ్ ఫోటో షూట్ వివాదంలో చిక్కుకున్న రణవీర్ సింగ్.. పోలీసు కేసు నమోదు!

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ తన బోల్డ్ ఫోటోషూట్‌లతో నిరంతరం వార్తల్లో ఉంటాడు. రణవీర్ ఈ ఫోటోషూట్ చేసినప్పటి నుండి ఆ ఫోటో షూట్ పై సాధారణ ప్రజలు సహా సినీ తారల నుండి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే నటుడు రణ్‌వీర్‌ సింగ్‌పై న్యూడ్‌ ఫోటోషూట్‌పై ఫిర్యాదు చేసినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. రణవీర్ సింగ్ నగ్న చిత్రాలు కనిపించినప్పటి నుండి ఆయన ట్రోల్ అవుతున్నారు. ఇదొక్కటే కాదు, రణవీర్ సింగ్ పై అనేక రకాల మీమ్స్ కూడా వైరల్ కావడం స్టార్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సోమవారం ముంబై పోలీసులకు దరఖాస్తు చేశారు.

అందుతున్న సమాచారం ప్రకారం, రణవీర్పై ఫిర్యాదులో, రణవీర్ సింగ్ 'మహిళల మనోభావాలను దెబ్బతీశారని' ఆరోపించారు. ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీవో)కి చెందిన ఓ అధికారి చెంబూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సహా ఇండియన్ పీనల్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద నటుడిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదుదారు కోరారు. ఈ విషయంపై, పోలీసు అధికారి మాట్లాడుతూ, "సోమవారం ఒక స్వచ్ఛంద సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తి నుండి మాకు దరఖాస్తు వచ్చింది, అని ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అన్నారు. రణవీర్ నగ్న చిత్రాలు బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన వివాదాలలో ఉన్నారు.

FIR filed against Bollywood actor Ranveer Singh over nude photographs

ఈ ఫోటోషూట్ వైరల్ కావడంతో ఇప్పుడు దానిపై రాజకీయాలు కూడా మొదలయ్యాయి. ఆయన షేర్ చేసిన చిత్రాలను ప్రశ్నిస్తూ, సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్ర చీఫ్ అబూ అజ్మీ ట్వీట్ చేశారు. బహిరంగంగా నగ్నంగా ఉండటం 'కళ' మరియు 'స్వేచ్ఛ' అని కాబట్టి హిజాబ్ ధరించడంపై ఎందుకు 'ఒత్తిడి'? అని ఆమె తన ట్వీట్‌లో ప్రశ్నించారు అయితే, ఈ నటుడి ఫోటోషూట్‌ విషయంలో పరిశ్రమలోని ఆయన కో యాక్టర్స్ అతనికి నిరంతరం మద్దతు ఇస్తూనే ఉన్నారు.

ఇదే క్రమంలో ఇటీవల రణవీర్‌తో కలిసి రాకీ అండ్ రాణి కి లవ్ స్టోరీ సినిమాలో నటించిన నటి అలియా భట్ కూడా తన స్పందనను తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ, "నాకు ఇష్టమైన రణ్‌వీర్ సింగ్ గురించి నెగటివ్ గా ఏదైనా వినడం సహా చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను అతనిని ఎప్పుడూ ప్రేమిస్తున్నాను, అతను నాకే కాదు అందరికీ ఇష్టమైన ఆర్టిస్ట్. రణవీర్ మనకు అద్భుతమైన సినిమాలను ఇచ్చాడు. కాబట్టి మనం వారికి ప్రేమను మాత్రమే ఇవ్వాలని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X