twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ విలన్‌పై కేసు: టీనేజ్ అమ్మాయిపై లైంగిక దాడి.. ఏ క్షణంలోనైనా అరెస్ట్

    |

    మాస్ మహారాజా రవితేజ నటించిన టచ్ చేసి చూడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రముఖ సినీ, టెలివిజన్ నటుడు షాబాజ్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. టీనేజ్ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై కేసు నమోదు కావడం బాలీవుడ్ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలు, నమోదైన కేసుపై స్పందించడానికి షాబాజ్ ఖాన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ వివాదాస్పద అంశంపై సరైన క్లారిటీ అందుబాటులోకి రాలేకపోయింది. అయితే ఇంతకు ఈ అంశంలో మీడియా కథనాల్లో వెలుగులోకి వచ్చిందేమిటంటే..

    ఐపీసీ సెక్షన్ ప్రకారం..

    ఐపీసీ సెక్షన్ ప్రకారం..


    లైంగిక వేధింపుల వ్యవహారంలో నటుడు షాబాజ్ ఖాన్‌పై ఐపీసీ సెక్షన్ 354, సెక్షన్ 509 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైంది. తన ఇష్టానికి వ్యతిరేకంగా మహిళపై లైంగిక దాడి చేయడం, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం, వ్యవహరించడం లాంటి ఆరోపణలను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు అని వెల్లడైంది.

    అదుపులోకి తీసుకోకపోవడం


    అయితే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న షాబాజ్ ఖాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ.. ఇంకా అతడిని అదుపులోకి తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, నటుడు షాబాజ్ ఖాన్‌పై ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దర్యాప్తు వేగంగా కొనసాగుతున్నది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.

    టెలివిజన్ రంగంలో

    టెలివిజన్ రంగంలో

    షాబాజ్ వ్యక్తిగత విషయానికి వస్తే.. పద్మ భూషన్ అవార్డు గ్రహీత, క్లాసికల్ గాయకుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ కుమారుడు. షాబాజ్ అసలు పేరు హైదర్ ఖాన్. తన కెరీర్ ఆరంభంలో టీవీలలో తెనాలి రామ, రామ్ సియా కే లవ్ కుష్, దస్తాన్ ఏ మొహబ్బత్, సలీం అనార్కలి నటించారు. ఆ తర్వాత యుగ్, ది గ్రేట్ మరాఠా, బేటల్ పచిసి, చంద్రకాంత, ది స్వార్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అలాంటి సీరియల్స్ నటించారు.

    Recommended Video

    ఆ వీడియో షేర్ చేసి దొరికిపోయిన సినీనటి సంజన.. పోలీసుల నోటీసులు!!
    సినీ కెరీర్ గురించి

    సినీ కెరీర్ గురించి

    ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే తెలుగులో టచ్ చేసి చూడు సినిమాలో రావుఫ్ లాలా అనే చిత్రంలో విలన్‌గా నటించారు. అలాగే కన్నడ, పంజాబీ, మరాఠా, గుజరాతీ, హిందీతోపాటు డైయింగ్ టు సర్వైవ్ అనే చైనీస్ చిత్రంలో కూడా కీలక పాత్రను పోషించారు.

    English summary
    molestation case filed on Shahbaz Khan. ANI tweeted that Case of molestation filed against actor Shahbaz Khan at Oshiwara Police Station. FIR registered under IPC sec 354 (Assault or criminal force to woman with intent to outrage her modesty) & 509 (Word, gesture or act intended to insult modesty of a woman). Investigation on.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X