twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #మీటూ ఎఫెక్ట్: ప్రముఖ నటుడి చుట్టూ బిగిసిన ఉచ్చు, రేప్ కేసు నమోదు!

    |

    ప్రముఖ హిందీ నటుడు అలోక్‌నాథ్ మీద రేప్ కేసు నమోదైంది. అలోక్ నాథ్ తనపై అత్యాచారం చేసినట్లు ప్రముఖ టీవీ రచయిత, నిర్మాత ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 376 కింద ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

    ప్రముఖ టీవీ రచయిత, నిర్మాత మీటూ ఉద్యమంలో భాగంగా అక్టోబర్లో తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా అలోక్ నాథ్ మీద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 19 ఏళ్ల క్రితం తనపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆమె ఆరోపించారు.

    ఈ మూమెంట్ కోసం వెయిట్ చేశాను

    ఈ మూమెంట్ కోసం వెయిట్ చేశాను

    అలోక్ నాథ్ తన ఇంట్లోనే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, 19 ఏళ్ల క్రితం ఈ సంఘటన జరిగినపుడు దీని గురించి నా స్నేహితులకు చెబితే అతడు పెద్ద యాక్టర్, కంప్లయింట్ చేస్తే నీ కెరీర్ నాశనం అవుతుంది అని నన్ను భయ పెట్టారు. అందుకే అపుడు అతడిపై ఫిర్యాదు చేయలేక పోయాను. మీటూ ఉద్యమం కారణంగా ఇన్నాళ్లకు ఈ విషయం బయటపెట్టే అవకాశం వచ్చింది అని బాధితురాలు వెల్లడించారు.

    ఫ్యామిలీతో గోవా వెళ్లిన బన్నీ... ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఫ్యామిలీతో గోవా వెళ్లిన బన్నీ... ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా?

     ఆరోపణలను ఖండించిన అలోక్ నాథ్

    ఆరోపణలను ఖండించిన అలోక్ నాథ్

    అయితే తనపై వచ్చిన ఆరోపణలను అలోక్ నాథ్ ఇప్పటికే ఖండించారు. ఈ సంఘటన గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఈ ఆరోపణల నేపథ్యంలో సినీ, టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సైతం అలోక్ నాథ్‌కు నోటీసులు పంపగా... ఆయన తరుపు లాయర్ స్పందిస్తూ తన క్లయింటు మీద వచ్చిన ఆరోపణలను ఖండించారు.

     రూపాయి పరువు నష్టంతో వార్తల్లో

    రూపాయి పరువు నష్టంతో వార్తల్లో

    అంతే కాకుండా తనపై బాధితురాలు చేసిన ఆరోపణలను ఖండిస్తూ అలోక్ నాథ్... ఆమెపై ఒక రూపాయి పరువు నష్టం దావా వేయడం ద్వారా మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

    ఎవరికీ జవాబుదారీ కాదు

    ఎవరికీ జవాబుదారీ కాదు


    అనంతరం ‘ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్' నుంచి సైతం అలోక్‌నాథ్‌కు నోటీసులు అందాయి. ఈ నోటీసులపై అతడు స్పందిస్తూ... తనపై ఎలాంటి ఫార్మల్ పోలీస్ కంప్లయింట్ నమోదు కాలేదని, అందువల్ల తాను ఎవరికీ, ఏ సంస్థకు జవాబుదారీ కాదనే రిప్లై ఇచ్చారు.

     పోలీస్ కంప్లయింట్, రంగంలోకి మహిళా కమీషన్

    పోలీస్ కంప్లయింట్, రంగంలోకి మహిళా కమీషన్

    ఈ నేపథ్యంలో బాధితురాలు అలోక్ నాథ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు జాతీయ మహిళా కమీషన్‌ను ఆశ్రయించి సహాయం కోరారు, తనకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ మమిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ స్పందించారు. ఈ కేసు విచారణ వేగవంతం అయ్యేలా చూడాలని మహారాష్ట్ర డీజీపీ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్)ను కోరారు.

    English summary
    An FIR has been registered under Section 376 of the Indian Penal Code (IPC) against actor Alok Nath who has been accused of sexual assault by a veteran TV writer-producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X