‘జీరో’ సెట్స్‌లో అగ్ని ప్రమాదం, తృటిలో తప్పించుకున్న షారుక్ ఖాన్
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటిస్తున్న 'జీరో' చిత్రానికి సంబంధించిన సెట్స్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న షారుక్ తృటిలో తప్పించుకున్నారు.
ముంబై ఫిల్మ్ సిటీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సాయంత్రం సంఘటన జరిగిన సమయంలో షారుక్ అక్కడే ఉన్నారని, అతడికి ఏమీ కాలేదని, కొంత సేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు.

పోలీసుల విచారణ
డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ వినయ్ రాథోడ్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు, ఈ సంఘటనకు కారణం ఏమిటనే దానిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలక్ట్రిక్ వైరింగ్, షూటింగ్ మెటీరియల్, రోప్స్, కర్టెన్లు కాలిపోయినట్లు తెలిపారు. పొగలు కమ్ముకోగానే నాలుగు ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పినట్లు వెల్లడించారు.

జీరో మూవీ
‘జీరో' చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం షారుక్ అండ్ టీమ్ సినిమా ప్రమోటషన్లలో బిజీగా గడుపుతున్నారు. తను వెడ్స్ మను ఫేం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కత్రినా కైఫ్, అనుష్క శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు.

మరుగుజ్జుగా షారుక్
ఈ చిత్రంలో షారుక్ ఖాన్ సినిమా మొత్తం మరుగుజ్జుగా కనిపించబోతున్నారు. లవ్, ఎమోషన్స్, కామెడీ కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షారుక్ ఖాన్ చేస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రంగా దీన్ని పేర్కొంటున్నారు.

సినిమాపై వివాదం
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితం ఓ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇందులోని కొన్ని సన్నివేశాలు సిక్కుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కొందరు కంప్లయింట్ చేశారు.


Click it and Unblock the Notifications











