Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
థగ్స్ ఆఫ్ హిందూస్థాన్: ఫిరంగిగా అమీర్ ఖాన్, లుక్ చూసి అంతా షాక్!
Recommended Video
బాలీవుడ్ నుండి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక, భారీ చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేయగా తాజాగా అమీర్ ఖాన్ లుక్ వదిలారు. ఇందులో అమీర్ ఖాన్ ఫిరంగి ముల్లాహ్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు అభిమానులు చూడని ఒక విభిన్నమైన లుక్‌లో ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఉండటం గమనార్హం.
ఫస్ట్ లుక్: శృంగార దేవతలా కత్రినా కైఫ్!
గాడిదపై ఊరేగుతూ...
బ్రిటిష్ అధికారి పాత కోటు, టోపీ ధరించి... గాడిదపై ఊరేగుతూ అమీర్ ఖాన్... ‘ఫిరంగి ముల్లాహ్' అనే పాత్రలో దర్శనమిచ్చాడు. చూడటానికి అమీర్ ఖాన్ లుక్ పిచ్చివాడిలా కనిపించినా... దీని వెనక ఏదో ఆసక్తికర స్టోరీ ఉంటుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.
|
నా అంత మంచోడు ఈ లోకంలో లేడు
‘ఇది నేను. ఫిరంగి మల్లాహ్. ఈ భూమిపై నాకంటే మంచి మనిషి మీకెక్కడా కనిపించడు. నిజం నా రెండో పేరు. నమ్మకం నా వృత్తి. నాయనమ్మ మీద ఒట్టు' అనే వ్యాఖ్యలు చేస్తూ అమీర్ ఖాన్ తన పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేశారు.
ఖుదాబక్ష్గా అమితాబ్
అమితాబ్ బచ్చన్ ఇందులో థగ్స్ నాయకుడు ఖుదాభక్ష్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన లుక్ విడుదలతో మొదలైన ఈ పోస్టర్ ప్రమోషన్స్ అమీర్ ఖాన్ లుక్ విడుదలతో మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.
థగ్స్ ఆఫ్ హిందూస్థాన్
ఈ చిత్రాన్ని ధూమ్-3 ఫేం విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ఎపిక్ యాక్షన్ అడ్వంచరస్ చిత్రంపై భారీ హోప్స్ నెలన్నాయి. సినిమాలోని ముఖ్య పాత్రల లుక్స్ విడుదల చేస్తూ చిత్ర యూనిట్ అంచనాలు మరింత పెంచుతోంది. ఈ సినిమాలో బ్రిటిష్ నటుడు లాయిడ్ ఓవెన్.....క్రూరమైన మనస్తత్వం కలిగిన బ్రిటిష్ ఆఫీసర్ జాన్ క్లీవ్ పాత్రలో కనిపించబోతున్నారు.