twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థగ్స్ ఆఫ్ హిందూస్థాన్: ఫిరంగిగా అమీర్ ఖాన్, లుక్ చూసి అంతా షాక్!

    |

    Recommended Video

    థగ్స్ ఆఫ్ హిందూస్థాన్: ఫిరంగిగా అమీర్ ఖాన్, లుక్ చూసి అంతా షాక్!

    బాలీవుడ్ నుండి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక, భారీ చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేయగా తాజాగా అమీర్ ఖాన్ లుక్ వదిలారు. ఇందులో అమీర్ ఖాన్ ఫిరంగి ముల్లాహ్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు అభిమానులు చూడని ఒక విభిన్నమైన లుక్‌లో ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఉండటం గమనార్హం.

    ఫస్ట్ లుక్: శృంగార దేవతలా కత్రినా కైఫ్!ఫస్ట్ లుక్: శృంగార దేవతలా కత్రినా కైఫ్!

    గాడిదపై ఊరేగుతూ...

    బ్రిటిష్ అధికారి పాత కోటు, టోపీ ధరించి... గాడిదపై ఊరేగుతూ అమీర్ ఖాన్... ‘ఫిరంగి ముల్లాహ్' అనే పాత్రలో దర్శనమిచ్చాడు. చూడటానికి అమీర్ ఖాన్ లుక్ పిచ్చివాడిలా కనిపించినా... దీని వెనక ఏదో ఆసక్తికర స్టోరీ ఉంటుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.

    నా అంత మంచోడు ఈ లోకంలో లేడు

    ‘ఇది నేను. ఫిరంగి మల్లాహ్‌. ఈ భూమిపై నాకంటే మంచి మనిషి మీకెక్కడా కనిపించడు. నిజం నా రెండో పేరు. నమ్మకం నా వృత్తి. నాయనమ్మ మీద ఒట్టు' అనే వ్యాఖ్యలు చేస్తూ అమీర్ ఖాన్ తన పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేశారు.

    ఖుదాబక్ష్‌గా అమితాబ్

    ఖుదాబక్ష్‌గా అమితాబ్

    అమితాబ్ బచ్చన్ ఇందులో థగ్స్ నాయకుడు ఖుదాభక్ష్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన లుక్ విడుదలతో మొదలైన ఈ పోస్టర్ ప్రమోషన్స్ అమీర్ ఖాన్ లుక్ విడుదలతో మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.

     థగ్స్ ఆఫ్ హిందూస్థాన్

    థగ్స్ ఆఫ్ హిందూస్థాన్

    ఈ చిత్రాన్ని ధూమ్-3 ఫేం విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ఎపిక్ యాక్షన్ అడ్వంచరస్ చిత్రంపై భారీ హోప్స్ నెలన్నాయి. సినిమాలోని ముఖ్య పాత్రల లుక్స్ విడుదల చేస్తూ చిత్ర యూనిట్ అంచనాలు మరింత పెంచుతోంది. ఈ సినిమాలో బ్రిటిష్ నటుడు లాయిడ్ ఓవెన్.....క్రూరమైన మనస్తత్వం కలిగిన బ్రిటిష్ ఆఫీసర్ జాన్ క్లీవ్ పాత్రలో కనిపించబోతున్నారు.

    English summary
    Check out the First look of Aamir Khan as Firangi in his upcoming film Thugs of Hindostan. Touted to be one of the biggest releases of this year, the makers of Thugs Of Hindostan are raising the curiosity around the film by dropping videos everyday which reveal the characters of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X