Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వావ్.... ఈ హీరోయిన్ చేసే పీట్లు చూస్తే మీరూ షాకవుతారు!
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లయింది. అప్పటికీ ఇప్పటికీ ఆమెలో అందం పరంగా, ఫిజిక్ పరంగా ఎలాంటి మార్పులేదు. తనలో సెక్సీనెస్ ఏమాత్రం తగ్గకుండా మెయింటేన్ చేస్తూ బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోంది.
జాక్వెలిన్ ఫిట్నెస్ పరంగా ఎంత కేర్ తీసుకుంటుందో ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన వీడియో చూస్తే స్పష్టమవుతుంది. ఈ శ్రీలంకన్ బ్యూటీ చేస్తున్న ఫీట్లు చూస్తే మీకు కూడా ఒళ్లు జలదరించడం ఖాయం.
తన అందం, టాలెంటుతో ఇక్కడ ఎంతో మంది అభిమానులను ఏర్పరుచుకున్న ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోంది. కిక్, డిష్యుం, జడ్వా 2 లాంటి హిట్ చిత్రాలక్లో నటించింది. వచ్చేవారం సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ మూవీ రేస్-3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాక్వెలిన్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తాను 'కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో షారుక్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించి 'దేవ్దాస్' సినిమా చూశాను. ఆ సినిమా నాకు ఎంతలా నచ్చిందంటే ఇంటికెళ్లి డీవీడీ తెప్పించుకుని మళ్లీ మళ్లీ చూశాను. ఇందులో యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, తెరకెక్కించిన విధానం ఇంప్రెస్ చేసింది. తర్వాత సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన మరో చిత్రం 'బ్లాక్' చూశాను. ఈ రెండు సినిమాలు చూశాక ఇండియా వచ్చి ఇక్కడి సినిమాల్లో పని చేయాలని నిర్ణయించుకున్నాను అని జాక్వెలిన్ తెలిపారు.