Shilpa Shetty నా కాపురంలో చిచ్చుపెట్టింది.. వైరల్‌గా రాజ్ కుంద్రా మొదటి భార్య ఆరోపణలు

ప్రముఖ సినీ తారల్లో చాలా మంది అప్పటికే పెళ్లైన వారిని భర్తలుగా చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. సావిత్రి నుంచి శ్రీదేవి.. ఇప్పటి తరంలో శిల్పాశెట్టి వరకు అప్పటికే వివాహమైన వారినే భర్తగా స్వీకరించారు. అయితే టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో శిల్పాశెట్టి ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకోవడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే శిల్పాశెట్టిపై రాజ్ కుంద్రా మొదటి భార్య కవితా కుంద్రా చేసిన విమర్శలు, ఆరోపణలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా కవిత ఏమన్నారు? శిల్పాశెట్టి వ్యక్తిగత, వైవాహిక జీవితంలో వెళితే..

 2009లో శిల్పాశెట్టి వివాహం

2009లో శిల్పాశెట్టి వివాహం

శిల్పాశెట్టి విషయానికి వస్తే.. బాలీవుడ్‌‌లో పలు బ్రేకప్స్ తర్వాత ఎన్నారై, వ్యాపారవేత్త రాజ కుంద్రాను వివాహం చేసుకొన్నారు. 2009 నవంబర్‌లో జరిగిన వివాహం మీడియా పతాక శీర్షికలను ఆకర్షించింది. ఆ తర్వాత వారిద్దరి దాంపత్యం అన్యోన్యంగా సాగుతూనే ఉంది. వారికద్దరికి వియాన్ రాజ్ అనే కుమారుడు, సమిషాశెట్టి కుంద్రా అనే కుమార్తె ఉన్నారు.

 రాజ్ కుంద్రా మొదటి వివాహం

రాజ్ కుంద్రా మొదటి వివాహం

అయితే శిల్పాశెట్టిని పెళ్లి చేసుకోవడానికి ముందు రాజ్ కుంద్రా గురించి గానీ, అతడి వైవాహిక జీవితం గురించి పెద్దగా తెలిసిన దాఖలాలు లేవు. తన తొలి వివాహం కవితా కుంద్రాతో జరిగింది. వారికి దిలీనా కుంద్రా అనే కూతురు కూడా ఉంది. దిలీనా నెలల బిడ్డగా ఉన్న సమయంలోనే కవిత, రాజ్ కుంద్రా విడిపోయారు. ఆ సమయంలో శిల్పాశెట్టిపై కవిత చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్‌గా మారాయి.

 నా కాపురం కూలిపోవడానికి కారణం

నా కాపురం కూలిపోవడానికి కారణం

రాజ్ కుంద్రాతో శిల్పాశెట్టి పెళ్లి తర్వాత కవితా కుంద్రా విదేశీ ఆంగ్ల పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. తన కాపురం విచ్చిన్నం కావడానికి కారణం శిల్పాశెట్టి అంటూ కవిత విరుచుకుపడ్డారు. పలు పత్రికల్లో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి అతిసన్నిహితంగా ఉన్న ఫోటోలు చూశాను. నా స్థానంలో నాభర్తతో ఆమె లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారనే బాధతో కుమిలిపోయాను అని కవితా కుంద్రా తెలిపారు.

 విడాకుల కోసం బలవంతం చేసి

విడాకుల కోసం బలవంతం చేసి

నా కాపురంలో చిచ్చు పెట్టబోతుందనే బాధతో శిల్పాశెట్టితో పలుమార్లు మాట్లాడాను. నా సంసారాన్ని కూల్చవద్దని చెప్పిన నా మాటలను పెడచెవిన పెట్టారు. నా కంటే తెలివిగా ఆయనను వశపర్చుకొన్నారు. దాంతో విడాకులు ఇవ్వమని రాజ్ కుంద్రా నన్ను బలవంతం చేశారు. నన్ను కాకుండా మరెవరినైనా పెళ్లి చేసుకొంటున్నావా అంటే మౌనంగా ఉన్నారు అంటూ అప్పట్లో కవిత కుంద్రా తన ఆవేదనను వ్యక్తం చేశారు.

కవిత కుంద్రా ఆరోపణలపై రాజ్ కుంద్రా

కవిత కుంద్రా ఆరోపణలపై రాజ్ కుంద్రా

ఇదిలా ఉండగా, కవితా కుద్రా ఆరోపణలపై రాజ్ కుంద్రా స్పందించారు. నా మాజీ భార్య నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేసింది. శిల్పాశెట్టిపై కవిత షాకింగ్ ఆరోపణలు చేసి బాధపెట్టినందుకు నేను స్వయంగా క్షమాపణలు చెప్పుతాను అని మీడియాకు రాజ్ కుంద్రా తెలిపారు. ఇంగ్లాండ్‌లో ప్రముఖ వ్యాపార కుమార్తె అయిన కవితను 2003లో వివాహం చేసుకొన్నారు. 2006లో వారిద్దరు విడిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X