రష్మికకి కలిసొచ్చిన తెలుగు ఫ్లాప్ సినిమా.. ఆ సినిమా చూసే ఆ బంపర్ ఆఫర్!

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకెళ్తున్న వారిలో రష్మిక మందన ఒకరు. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముందు చిన్న హీరోలతో సినిమాలు చేసిన ఈ భామ తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టి, సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తోంది రష్మిక. ఇక ఇక్కడ బిజీగా ఉన్న సమయంలో రష్మికకి రెండు బాలీవుడ్ సినిమాల్లో అవకాశం దక్కింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ భామ రెండు సినిమాల్లో నటిస్తోంది.

అయితే ఆమెకు మొదటి బాలీవుడ్ అవకాశం దక్కడానికి కారణం ఆమె కెరీర్ లో ఫ్లాప్ గా నిలిచిన ఒక సినిమా అంటే నమ్మక తప్పదు. ఆ సినిమా మరేమిటో కాదు, 'డియర్ కామ్రేడ్'. ఈ సినిమా వల్ల రష్మిక బాలీవుడ్ ఛాన్స్ లభించిందట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు రష్మికను 'మిషన్ మంజు' సినిమాతో బాలీవుడ్ కి పరిచయం చేస్తున్న దర్శకుడు శాంతన భాగ్చీ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయమై మాట్లాడుతూ 'డియర్ కామ్రేడ్ లో రష్మిక నటనను చూసి ఇంప్రెస్ అయ్యానన్న ఆయన ఆ సినిమా చూసే అవకాశం ఇచ్చానని చెప్పుకొచ్చారు.

Flop film helped Rashmika sign her Bollywood debut film

నిజానికి మా సినిమాలో అందం, అమాయకత్వం, ఉన్న నటి కావాలని అలా ఇవన్నీ తనలో కనిపించాయని చెప్పుకొచ్చారు. జూమ్ లో స్క్రిప్ట్ చెప్పినప్పుడు రష్మిక కూడా ఆమె చేసే పాత్ర ఇంపార్టెన్స్ గుర్తెరిగిన విషయం తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. స్పై థ్రిల్లర్ 'మిషన్ మంజు'లో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తుండగా ఆ సినిమాలో రష్మిక హీరోయిన్. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆమె అమితాబ్ తో 'గుడ్ బై' సినిమా కూడా కమిట్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X