twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లిప్‌లాక్‌‌తో విజృంభించిన బాలయ్య హీరోయిన్... అవకాశాల్లేకనేనా ఆ సీన్లలో!

    |

    Recommended Video

    Seasoned With Love - Teaser

    టాలీవుడ్‌లో అవకాశాలు వెక్కిరించడంతో బాలీవుడ్‌కు తిరుగుముఖం పట్టిన అశాసైనీ అలియాస్ ఫ్లోరా సైనీ ఇప్పుడు హాట్ హాట్‌గా నటిస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్‌లో కూడా అంతంతగా ఆఫర్లు రావడంతో షార్ట్ ఫిలింలో కూడా నటించడానికి ఆలోచించడం లేదు. తాజాగా ఫ్లోరా సైనీ సీజన్డ్ విత్ లవ్ అనే షార్ట్ ఫిలింలో నటించింది. ఈ చిత్రంలో సుధాంశు పాండేతో చేసిన లిప్‌లాక్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే...

     లిప్‌లాక్‌ విమర్శలపై ఫ్లోరా సైనీ

    లిప్‌లాక్‌ విమర్శలపై ఫ్లోరా సైనీ

    సీజన్డ్ విత్ లవ్‌లో సుధాంశుపాండేతో గాఢమైన లిప్‌లాక్ చేయడంపై వస్తున్న విమర్శలపై ఫ్లోరాసైనీ స్పందించారు. స్క్రిప్టు డిమాండ్ మేరకే లిప్‌లాక్ చేయాల్సి వచ్చింది. అలాంటి అసభ్య సన్నివేశాల్లో నటించడానికి మొహమాటపడ్డాను. కానీ సుంధాశు, డైరెక్టర్ లక్ష్మీ అయ్యర్ నాకు కల్పించిన వాతావరణంతో కంఫర్ట్‌గా ఫీలయ్యాను. అందుకే ఆ సీన్ బాగా పండింది అని ఆశాసైనీ పేర్కొన్నారు.

    ఆ సీన్‌లో ఎందుకు నటించానంటే

    ఆ సీన్‌లో ఎందుకు నటించానంటే

    లిప్‌లాక్‌ను అత్యంత సృజనాత్మకంగా షూట్ చేశారు. ఆ సీన్‌కు అత్యంత ప్రాధాన్యం ఉండటంతో ఇద్దరం చెలరేగిపోయాం. ప్రేక్షకుల వ్యక్తిగత జీవితాల్లో కనిపించని సన్నివేశాల్లో జీవించడానికి నటీనటులుగా మా వంతు కష్టపడ్డాం అని ఫ్లోరా సైనీ అన్నారు. షార్ట్ ఫిలిం అయినప్పటికీ.. కథలో ఉండే కీలక సన్నివేశాల్లో భాగంగా ఆ సీన్‌లో నటించాం అని తెలిపారు. తాను నటించిన షార్ట్ ఫిలిం ట్రైలర్‌ను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు.

    స్త్రీ మూవీ విజయంతో జోష్

    స్త్రీ మూవీ విజయంతో జోష్

    ఇక కెరీర్ విషయానికి వస్తే, ఫ్లోరా సైనీ గతేడాది బాలీవుడ్ చిత్రం స్త్రీలో నటించింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధాకపూర్‌తో కలిసి కీలక పాత్రల్లో కనిపించారు. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకొన్నది. స్త్రీ సినిమా తర్వాత తన కెరీర్‌పై ఫ్లోరా సైనీ భారీగా ఆశలు పెట్టుకొన్నది. ఫ్రాడ్ సయ్యాన్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నది.

    తెలుగులో 30పైగా సినిమాల్లో

    తొలుత అశా సైనీ పేరుతో ప్రేమ కోసం అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. అమ్మో ఒకటో తారీఖు, నరసింహనాయుడు, అక్కా బావెక్కడ, నువ్వు నాకు నచ్చావ్, దంబంగ్ 2 లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో సుమారు 30కి పైగా సినిమాల్లో కనిపించింది. ఆమె నటించిన చివరి తెలుగు చిత్రం ఆకాశంలో సగం.

    English summary
    Bollywood actress Flora Saini, who was last seen in Fraud Saiyyan, has shot for a short film titled Seasoned With Love. The Stree actress will be seen sharing the screen space with Sudhanshu Pandey in the short. Flora says, "It was the demand of the script. Such scenes get a bit awkward at times but Sudhanshu and our director, Lakshmi Iyer, made me feel pretty comfortable.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X