నాపై దారుణంగా దాడి.. గుద్దితే ముఖం చిట్లి.. నిర్మాత అరాచకాలపై హీరోయిన్

బాలీవుడ్ నిర్మాత గౌరంగ్ దోషికి నటి ఫ్లోరా సైనీ మరోసారి లీగల్ నోటీసులు పంపించారు. లైంగిక వేధింపుల బయటకు వెల్లడిస్తూ చేపట్టి మీ టూ ఉద్యమం ఊపందుకోవడంతో సైనీ మరోసారి తన కష్టాలను ఏకరవుపెట్టారు. ఇటీవలసంచలన విజయం సాధించిన స్త్రీ చిత్రంలో ఫ్లోరా సైనీ మంచి నటనతో ఆకట్టుకొన్నారు. గతంలో నిర్మాతపై పెట్టిన కేసు విషయంలో లీగల్ నోటీసులు పంపడం బాలీవుడ్‌‌లో చర్చనీయాంశమైంది. తనను ఏవిధంగా కొట్టాడో అనే విషయంపై తన ఫేస్‌బుక్ ఖాతాలో ఫొటోలను షేర్ చేసింది.

నిర్మాత నాపై దాడి చేశాడు

నిర్మాత నాపై దాడి చేశాడు

నిర్మాత గౌరంగ్ దోషి‌తో 2007లో డేటింగ్ చేశాను. వాలైంటిన్స్ డే రోజున నాపై దాడి చేశాడు. తీవ్రంగా దూషిస్తూ దారుణంగా కొట్టారు. బలంగా గుద్దడంతో నా గదమ విరిగిపోయింది. ఆ గాయం కారణంగా నా జీవితం దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబడింది.

ఇండస్ట్రీలో బాగా పలుకుబడితో

ఇండస్ట్రీలో బాగా పలుకుబడితో

నాపై దాడి చేసిన సమయంలో గౌరంగ్ దోషి గురించి ప్రముఖులకు చెప్పాను. కానీ ఆయనకు ఇండస్ట్రీలో బాగా పలుకుబడి ఉండటంతో నాకు సహకరించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

బెదిరింపులకు పాల్పడ్డాడు

బెదిరింపులకు పాల్పడ్డాడు

ఆయనపై నేను కేసు పెట్టడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత నాకు అవకాశాలు రాకుండా చేశారు. నాకు వచ్చిన అవకాశాల స్థానంలో మరొకరికి ఛాన్స్‌లు ఇప్పించారు. రకరకాల ప్రయత్నాలు చేసి ఇండస్ట్రీకి దూరం చేశారు.

నాకైన గాయాలు చూడండి

నాకైన గాయాలు చూడండి

నేను పబ్లిసిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నానని రూమర్లు క్రియేట్ చేశారు. నన్ను ఏ విధంగా గాయపరిచారో మీరే చూడండి. నా ఫొటోలు చూసిన తర్వాత నాకు చాలా మంది అండగా నిలిచారు అని ఫ్లోరా సైనీ తెలిపారు.

ఫ్లోరా సైనీ ఆరోపణలు అబద్ధం

ఫ్లోరా సైనీ ఆరోపణలు అబద్ధం

అయితే ఫ్లోరా సైనీ చేస్తున్న ఆరోపణలను గౌరంగ్ దోషి ఖండించారు. నాపై ఆరోపణలు చేస్తూ ఫ్లోరా సైనీ నా ప్రతిష్ఠను దెబ్బ తీస్తున్నది. తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్లిసిటీ కోసం నా పేరు వాడుకొంటున్నది అని గౌరంగ్ దోషి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.

దోషి అరాచకాలు కోర్టులోనే

దోషి అరాచకాలు కోర్టులోనే

గౌరంగ్ దోషి అరాచకాలను మీడియాలో చెప్పడం వల్ల ప్రయోజనం లేదని భావిస్తున్నాను. ఇక చట్టపరంగా చర్యలు తీసుకొంటాను. అతను అబద్ధాలు ఆడుతున్నారనే విషయం స్పష్టమైంది. నేను పెట్టిన కేసులో అతను నిర్ధోషి అనేి చెప్పుకొంటున్నాడు. కానీ ఏ కేసులో కూడా అతను నిర్దోషి అని కోర్టు చెప్పలేదు అని ఫ్లోరా సైనీ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X