నగ్నంగా నటించడం ఒక ఛాలెంజ్... అలాంటి వాటికి సిద్ధమే అంటున్న లక్స్ పాప!
తెలుగులో బాలయ్య హీరోగా తెరకెక్కిర నరసింహ నాయుడు సినిమాలో 'లక్స్ పాప' సాంగ్ ద్వారా పాపులర్ అయినా ఆశా షైనీ సౌత్ ఇండస్ట్రీలో దాదాపు 50 సినిమాల్లో నటించింది. అయితే ఇపుడు అవకాశాలు లేక పోవడంతో బాలీవుడ్ వెళ్లిపోయింది. ఇపుడు తన అసలు పేరు ఫ్లోరా షైనీతో కంటిన్యూ అవుతోంది.
ఇటీవలే హిందీలో సూపర్ హిట్ అయిన 'స్త్రీ' చిత్రంలో కీలక పాత్ర పోషించిన ఫ్లోరా షైనీ త్వరలో 'గంది బాత్ 2' అనే వెబ్ సిరీస్‌లో కనిపించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ బాలీవుడ్ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు.

న్యూడ్ సీన్లలో ఫ్లోరా
‘గంది బాత్ 2'లో ఫ్లోరా షైనీ కొన్ని న్యూడ్ సీన్లలో కూడా నటించారు. ఇందులో శృంగార సంబంధమైన సీన్లు తారా స్థాయిలో ఉండబోతున్నాయి. పని మనిషి పాత్రలో కనిపించబోతోంది. ఒకే ఇంట్లోని ఇద్దరు అన్నదమ్ము ఆమెతో ప్రేమలో పడతారు. ఈ క్రమంలో వచ్చే సీన్లు సూపర్ హాట్‌గా ఉండబోతున్నాయట.

నాకు దర్శకుడి మీద నమ్మకం ఉంది
శృంగార సంబంధమైన స్టీమీ సీన్లలో చేసేపుడు ఏ మాత్రం తేడా వచ్చినా వాటి ఎపెక్ట్ మరోలా ఉంటుంది. కొన్ని సార్లు కథకు తగిన విధంగా నటించక తప్పదు. నాకు దర్శకుడు సచిన్ మోహిత్ మీద నమ్మకం ఉంది. ఆ సీన్ల కళాత్మకంగా చిత్రీకరించారు అని ఫ్లోరా షైనీ తెలిపారు.

ఛాలెంజింగ్‌గా ఉంటాయి, అందుకే ఒప్పుకున్నా
సెక్స్ కంటెంట్ ఉన్న స్టీమీ సీన్లు చేయడం అంటే సవాలుతో కూడుకున్నది. అలాంటి సవాళ్లు స్వీకరించడం అంటే నాకు ఇష్టం. అందుకే స్కిన్ షో ఎక్కువగా ఉన్నప్పటికీ చేయడానికి అంగీకరించాను అని ఫ్లోరా షైనీ వెల్లడించారు.

కథ డిమాండ్ చేస్తే న్యూడ్ సీన్లు చేస్తా
కథ డిమాండ్ చేసినపుడు న్యూడ్ సీన్లు కూడా చేయడానికి సిద్ధమే అని, ఇదంతా నటనలో భాగమే అని ఫ్లోరా షైనీ తెలిపారు. ఆమె మాటలు చూస్తుంటే మున్ముందు మరింత హాట్ కంటెంట్ ఫ్లోరా షైనీ నుంచి వస్తుందని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











