twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియాంక మిస్ వరల్డ్ విజయం వెనుక భారీ మోసం.. మాజీ మోడల్ రిగ్గింగ్ ఆరోపణలు

    |

    మాజీ అందాల తార ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ గా కిరీటాన్ని అందుకున్న విషయం తెలిసిందే. గ్లామర్ ప్రపంచంలో ఎంతో పోటీ ఉన్నప్పటికీ కూడా ప్రియాంక చోప్రా తనదైన శైలిలో అందాలతో ఆకట్టుకునే ప్రపంచ సుందరిగా అప్పట్లో చరిత్ర సృష్టించింది. ఇక ఆమె ఆ తర్వాత ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోకుండా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక అగ్ర హీరోయిన్ గా కూడా గుర్తింపు అందుకునే వరకు వచ్చింది.

    మిస్ వరల్డ్ గా వచ్చిన క్రేజ్ ద్వారా ప్రియాంక పలు విదేశీ సినిమాల్లో కూడా నటిస్తూ ఇప్పుడు హాలీవుడ్ లో కూడా బిజీగా మాయపోయే స్థితికి వచ్చింది. అయితే ప్రియాంక చోప్రా ప్రపంచ అందాల పోటీలలో గెలవడం వెనుక భారీ మోసమే జరిగింది అంటూ అప్పట్లో ఆమెకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ బార్బడోస్ లీలాని ఆరోపణలు చేశారు. 22 ఏళ్ల తర్వాత ఆ విషయంపై ఆమె అనుమానాస్పద వ్యాఖ్యలు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

    former Miss Leilani McConney rigged comments on priyanka Chopra 2000 miss world title

    అప్పట్లో అందాల పోటీల్లో చాలా అవకతవకలు జరిగాయి అంటూ ఒకానొక సమయంలో ప్రియాంక చోప్రా తనను చాలా విసిగించింది అని కూడా ఆమె ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాకుండా తనను కావాలని మోసం చేశారని కూడా చెబుతూ.. ప్రియాంక చోప్రా కు సంబంధించిన ప్రత్యేకమైన దుస్తులు కూడా నా గదిలోనే డిజైన్ చేశారు అని ఆమె గురించి ప్రతి విషయం నేను క్షుణ్ణంగా పరిశీలించాను అని కూడా ఆమె తెలియజేసింది.

    అంతేకాకుండా స్కిన్ టోన్ మార్చుకునేందుకు అప్పటికప్పుడే కొన్ని క్రీములు కూడా వాడింది అని ఫైనల్ జడ్జిమెంట్ లో మోసం జరిగినట్లు తనకు అర్థం అయినట్లుగా ఆమె తెలియజేసింది. బార్బడోస్ లీలాని ఈ విధంగా స్పందించడం ఇంటర్నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంత కాలం ఈ విషయంలో ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని కూడా మరికొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కావాలని అనవసరంగా ప్రియాంక పై ఆరోపణలు చేస్తోందని కూడా మరికొందరు లీలాని వీడియోకు కౌంటర్లు ఇస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రియాంక చోప్రా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

    English summary
    former Miss Leilani McConney rigged comments on priyanka Chopra 2000 miss world title
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X