For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుశాంత్ నీవు లేవు.. కానీ నీ మ్యాజిక్ వెంటాడుతుంది.. ఎమ్ఎస్.ధోనికి నాలుగేళ్లు

  |

  బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రాణాలు విడిచి మూడు నెలలు దాటినా ఇంకా అతని జ్ఞాపకాలు కళ్ళముందు కదులుతునే ఉన్నాయి. సుశాంత్ బాలీవుడ్ లో వినూత్నమైన సినిమాలు ఎన్ని చేసినా కూడా అతని కెరీర్ కి సరిపోయేంత గుర్తింపును ఒకే ఒక్క సినిమా అందించింది. అదే ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ. మాజీ టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలై నేటికి నాలుగేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా అభిమానులు భావోద్వేగానికి గురవుతూ.. సుశాంత్ నీ మ్యాజిక్ ఇంకా వెంటాడుతూనే ఉందని చెబుతున్నారు.

  పాత్రలో ప్రాణం పెట్టి నటించాడు.

  పాత్రలో ప్రాణం పెట్టి నటించాడు.

  ధోని బయోపిక్ ద్వారా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇతర ఇండస్ట్రీల జనాలకు కూడా చాలా దగ్గరయ్యాడు. సౌత్జ్ ఇండియన్ భాషల్లో కూడా ఆ సినిమా భారీగా విడుదలైంది. ఆ సినిమానే అతని జీవితానికి ఎంతో కీర్తిని అందించింది. దర్శకుడు నీరజ్ పాండే మేకింగ్ కి తగ్గట్టుగానే సుశాంత్ ధోని పాత్రలో ప్రాణం పెట్టి నటించాడు. ఎక్కడా కూడా పొరపాటు లేకుండా ఒక వైపు ఆటను మరోవైపు కొనసాగిస్తూనే ఎమోషన్ సన్నివేశాల్లో బెస్ట్ పెర్ఫెమెన్స్ తో ఆకట్టుకున్నారు.

   బయోపిక్ కోసం ఏడాది పాటు.. ధోనితో కూడా..

  బయోపిక్ కోసం ఏడాది పాటు.. ధోనితో కూడా..

  ధోని బయోపిక్ కి సుశాంత్ సెట్టవ్వడని కొంతమంది దర్శకుడికి డైరెక్ట్ గా చెప్పారట. కానీ ఆ విమర్శకులకు దిమ్మ తిరిగేలా సుశాంత్ చేసిన హార్డ్ వర్క్ అంతా ఇంతా కాదు. దాదాపు ఒక ఏడాది వరకు ధోనీతో ట్రావెల్ అవుతూనే క్రికెట్ ఆటపై మరింత పట్టు సాధించాడు. ఒక ప్రొఫెషన్ క్రికెటర్ గా మారుతూనే తనలో ధోనిని క్రియేట్ చేసుకున్న సుశాంత్ వెండితెరపై ఎవరికి తెలియని ధోనిని చూపించాడు.

  బాల్యం నుంచి వరల్డ్ కప్ వరకు..

  బాల్యం నుంచి వరల్డ్ కప్ వరకు..

  ధోని బాల్యం నుంచి వరల్డ్ కప్ వరకు అతని జీవితం ఎలా కొనసాగింది? అనే విషయాన్ని చాలా క్లియర్ గా వెండితెరపై ఆవిష్కరించారు. బయోపిక్ లో ధోని ఫస్ట్ లవ్ గురించి చెప్పిన విషయం తెలిసిందే. మొదటి ప్రేయసి మరణించిన సీన్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఆ సినిమాలో అన్నిటికి కంటే ఆ ఎపిసోడ్స్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ధోని రియల్ లైఫ్ లో అలాంటి స్టోరీ ఉందని అప్పటివరకు ఎవరికి తెలియదు. ఇక ఆ తరువాత మిస్టర్ కూల్ సాక్షి ని వివాహమాడిన విషయం తెలిసిందే.

  Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
  ఆ మ్యాజిక్ ఇంకా వెంటాడుతూనే ఉంది

  ఆ మ్యాజిక్ ఇంకా వెంటాడుతూనే ఉంది

  సుశాంత్ కెరీర్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే.. ధోని బయోపిక్ కి ముందు, ఆ తరువాత అనేలా ప్రశంసలు దక్కాయి. ధోని పాత్ర కోసం సుశాంత్ ఫిట్నెస్ లోనే కాకుండా అతని హావభావాలతో కూడా అద్బుతంగా ఆకట్టుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి లాభాలను అందుకుంది. ఇక అతను మరణించడంతో అభిమానులు ధోని బయోపిక్ కి సంబంధించిన ఫొటోలతో సుశాంత్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇంకా వెంటాడుతూనే ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

  English summary
  Three months after the death of Bollywood young hero Sushant Singh Rajput, his memories are still fresh in his mind. No matter how many innovative films Sushant has made in Bollywood, only one film has given him enough recognition for his career. Same with MS Dhoni: The Untold Story. It has been four years since the release of this film based on the life of former Team India captain MS Dhoni. Fans are emotional on this occasion .. says that your magic is still haunting.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X